Share News

Manchiryāla- మోగిన నగారా

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:44 PM

దేశంలో పార్లమెంట్‌ ఎన్నికల నగరా మోగింది. మే 13న లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ రాజీవ్‌ కుమార్‌ శనివారం ఎన్నిల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Manchiryāla-     మోగిన నగారా
జైపూర్‌లో ఎన్నికల సందర్భంగా తీసుకోవల్సిన చర్యలపై చర్చిస్తున్న తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు

- జిల్లాలో 6 లక్షలకు పైగా ఓటర్లు

- మావోయిస్టుల కదలికలపై పోలీసుల ప్రత్యేక నిఘా

మంచిర్యాల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో పార్లమెంట్‌ ఎన్నికల నగరా మోగింది. మే 13న లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ రాజీవ్‌ కుమార్‌ శనివారం ఎన్నిల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ చేసిన జిల్లా ఉన్నతాధికారులు అందుకు సన్నద్ధం చేశారు. కాగా షెడ్యూల్‌ విడుదలతో విధి విధానాల నిర్వహణపై ధృష్టిసారిస్తున్నారు.

ఏర్పాట్లలో అధికారులు బిజీ..

పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియను కేంధ్ర ఎన్నికల కమిషన్‌ ప్రారంభిం చడంతో ఏర్పాట్లలో అధికారులు బిజీ అయ్యారు. పోలింగ్‌ స్టేషన్లు, ఈవీ ఎంల ఏర్పాటు, నియోజక వర్గాల వారీగా రిటర్నింగ్‌ ఆఫీసర్ల నియామ కం తదితర పనులు ఇప్పటికే పూర్తి చేశారు. ఓటరు జాబితాకు కూడా తుది మెరుగులు దిద్దగా, ఎన్నికలకు సరిపడా ఈవీఎంల విడిభాగాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వాటికి కలెక్టరేట్‌ సముదాయంలో ఓ గదిలో భద్రపరిచి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ నేతృత్వంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

- షెడ్యూల్‌ విడుదలతో..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ తక్ష ణమే అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వపరంగా చేప ట్టబోయే నూతన పనులకు ఆంక్షలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిలిపివేయనున్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపైనా అధికారులు పూర్తిస్థాయిలో ధృష్టి సారించను న్నారు. నగదు, బహుమతుల పంపకం, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు చమరగీతం పలకనున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై ఎన్నికల నియమావళి కింద కేసులు నమోదు చేయనున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల కమిషన్‌ అజమాయిషీ కిందకు వెళ్లనుం ది. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రూ. 50వేలకు మించి నగదుకు సంబంధించిన రసీదు, ఆధారాలు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. లేనిపక్షంలో ఈసీ సీజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. బంగారం, వెండి ఆభరణాల కొనుగోలుకు సంబంధించిన రసీదులు కూడా తప్పని సరి. కొనుగోలు, అమ్మకాలు, అస్పత్రుల బిల్లులు చెల్లింపులకు సంబంధిం చి రసీదులు అందుబాటులో ఉంచుకోవాలి.

- జిల్లాలో ఓటర్ల సంఖ్య..

జిల్లాలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఆగస్టు 21 ముసాయిదా జాబి తాను ముందుగా విడుదల చేసిన అధికారులు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఆగస్టు 26, 27 తేదీలతోపాటు సెప్టెంబరు 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించి చివరిగా చేర్పులకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుండగా, తుది జాబితాను త్వరలో విడుదల చేయనున్నారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులలో ముసాయిదా ప్రకారం 741 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 6,17,901 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,08,630, మహిళలు 3,09,229, ఇతరులు 42, సర్వీసు ఓటర్లు 627, ఎన్‌ఆర్‌ఐలు 29 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 27,907 మంది కొత్తగా నమోదయ్యారు. మంచిర్యాలలో 2 లక్షల 64వేల 540 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు లక్షా 31వేల 871, స్త్రీలు లక్షా 32వేల 292 మంది, థర్డ్‌ జండర్‌ 23, ఎన్‌ఆర్‌ఐలు 21, సీర్వసు ఓటర్లు 333 ఉన్నారు. చెన్నూరులో లక్షా 84వేల 256 మంది ఓటర్లు ఉండగా పురుషులు 91వేల 969, స్త్రీలు 92వేల 141, థర్డ్‌ జండర్‌ 07, ఎన్‌ఆర్‌ఐ 06, సర్వీసు ఓటర్లు 133 మంది ఉన్నారు. బెల్లంపల్లిలో మొత్తం ఓటర్లు లక్షా 69వేల 761 మంది ఉండగా, పురుషులు 84వేల 790, స్త్రీలు 84వేల 796, థర్డ్‌ జండర్‌ 12, ఎన్‌ఆర్‌ఐ 02, సర్వీసు ఓటర్లు 161 మంది ఉన్నారు. జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో 27,907 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. కాగా తుది ఓటర్‌ జాబితా విడుదల చేస్తే కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

- నిఘా ముమ్మరం..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీస్‌శాఖ ప్రత్యేక ధృష్టిసారించింది. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసులు నేతృత్వంలో ప్రత్యేక బలగాలు నిఘా ముమ్మరం చేశాయి. మంచిర్యాల జిల్లా మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉంది. ఇందులో ఇంటర్‌ స్టేట్‌, డిస్ట్రిక్ట్‌ బార్డర్‌ ఉన్నాయి. ఇంటర్‌ స్టేట్‌ బార్డర్‌లో భాగంగా కోటపల్లి వద్ద అంతర్జిల్లా చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ బార్డర్‌లో భాగంగా భూపాలపల్లి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌ ఉన్నాయి. వాటితోపాటు ప్రాణహి త సరిహద్దు ఫాయింట్లు కూడా ఉన్నాయి. దేశీదారు, గుడుంబా, గంజా యి, తదితర ప్రలోభాలకు సంబంధించిన వస్తువులు రవాణా కాకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు కోటపల్లి మండలం రాపన్‌ పల్లి వద్ద ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. పోలీస్‌శాఖతోపాటు ఎక్సైజ్‌, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు ఇందులో తనిఖీలు నిర్వహి స్తారు. కూంభింగ్‌, వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. సింగరేణి ప్రాంతం కావడంతో సికాస కార్యకలాపాలు ఊపందుకునే అవకాశాలు ఉండటంతో దానిపైనా కూడా పూర్తిస్థాయిలో ధృష్టిసారిస్తున్నారు. అలాగే ప్రముఖుల భద్రత ధృష్ట్యా కూడా ధృష్టిసారించారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ విషయమై ఈ నెల 15న జైపూర్‌ మండలం ఎస్టీపీపీ సమావేశ మందిరంలో అంతర్‌రాష్ట్ర, జిల్లా స రిహద్దు పోలీసు అధికారుల సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పని చేసేలా మార్గనిర్దేశం చేశారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 10:44 PM