మోదీని మళ్లీ ప్రధాని చేయాలి : అన్నామలై
ABN , Publish Date - May 12 , 2024 | 12:05 AM
దేశ సమగ్రాభివృద్ధి జరగాలంటే మోదీని మూడోసారి ప్రధాని చేయాలని తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పిలుపునిచ్చారు.

సూర్యాపేట(ఆంధ్రజ్యోతి), సూర్యాపేట సిటీ, మే 11: దేశ సమగ్రాభివృద్ధి జరగాలంటే మోదీని మూడోసారి ప్రధాని చేయాలని తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మా ట్లాడారు. బీఆర్‌ఎస్ కుటుంబానికి చెందిన పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కేవలం ఒకటి మాత్రమే అమలు చేసిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక కుటుంబం అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపిస్తే రూ.3వేల కోట్లు నల్లగొండ పార్లమెంట్ అభివృద్ధికి తీసుకువస్తారన్నారు. ఆరు లేన్ల జాతీయ రహదారి, ఇరువైపులా సర్వీ్‌సరోడ్డు, హైదరాబాద్ నుంచి విజయవాడకు సూర్యాపేట మీదుగా రైల్వేలైన్ తీసుకొస్తామన్నారు. నిరుద్యోగుల కోసం స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్లు, డ్రైపోర్టులు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని అనుకూలంగా ఉన్నారన్నారు. తమిళనాడు బీజేపీ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ టక్కుటమార గోకర్ణ విద్యలతో సీఎం రేవంత్‌రెడ్డి అదికారంలోకి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, పొలగాని ధనుంజయ్‌గౌడ్, చల్లమళ్ల నరసింహ, కర్నాటి కిషన్, జుట్టుకొండ సత్యనారాయణ, చల్లా శ్రీలతరెడ్డి, సలి గంటి వీరేందర్, శశిధర్‌రెడ్డి, కాంత్రిరెడ్డి, మల్సూర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.