ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రోహింగ్యాల అభ్యర్థి
ABN , Publish Date - Mar 31 , 2024 | 05:03 AM
రోహింగ్యాల అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అని.. బంగ్లాదేశ్ ముస్లింలకు అభ్యర్థిలా ఆయన వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జగిత్యాలలో శనివారం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ
బంగ్లా ముస్లింల ప్రతినిధిలా ఆయన శైలి
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
జగిత్యాల/హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రోహింగ్యాల అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అని.. బంగ్లాదేశ్ ముస్లింలకు అభ్యర్థిలా ఆయన వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జగిత్యాలలో శనివారం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవన్‌రెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని చెప్పారు. ఇక్కడ ఉన్న హిందువులు, భారతీయులకు తాను అభ్యర్థినని చెప్పారు. జీవన్ రెడ్డి కేవలం రోహింగ్యాల కోసం, బంగ్లాదేశ్ ముస్లింల కోసం ఎన్నికల్లో నిలబడినట్లు ఉందని విమర్శించారు. బంగ్లాదేశ్ నుంచి చట్టవ్యతిరేకంగా భారతదేశంలో చొరబడిన ముస్లింలకు మద్దతుగా ఇటీవల జీవన్‌రెడ్డి మాట్లాడారని తెలిపారు.
ఫీజు బకాయిలు చెల్లించండి: సంజయ్
రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలకు ఫీజు రీఇంబర్స్‌మెంట్ చెల్లింపులపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణం జోక్యం చేసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ‘‘గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో దాదాపు రూ.750 కోట్లు డిగ్రీ, పీజీ కళాశాలలకు మార్చి నెలాఖరు నాటికి చెల్లిస్తామని పేర్కొంటూ టోకెన్లు జారీ చేసింది. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. ఆదివారంతో టోకెన్ల గడువు ముగుస్తోంది. సీఎం జోక్యం చేసుకోకపోతే ఆ టోకెన్లు వృథా అవుతాయి. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.7,800 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా వందలాది కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని కళాశాలలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో వారు మధ్యలోనే చదువు మానేస్తున్నారు’’ అని సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ హోం మంత్రి, మాజీ డీజీపీలకు నోటీసులు ఇచ్చి విచారించాలని బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.