Share News

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:16 AM

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

11 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ

29న పోలింగ్‌, అదే రోజు ఫలితాల వెల్లడి

కడియం, పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామాలతో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 స్థానాలు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపింది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18తో నామినేషన్ల గడువు ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 22 దాకా ఉప సంహరణకు అవకాశం ఉంటుంది. 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల పదవీ కాలం 2027 నవంబరు 30వరకు ఉంటుంది. యూపీలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికీ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.

Updated Date - Jan 05 , 2024 | 03:16 AM