రేణుకాఎల్లమ్మకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పూజలు
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:32 AM
జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ఆమె అత్తగారు ఝాన్సీరెడ్డి ఇతర కుటుంబసభ్యులు ఆదివారం దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్ల మ్మ ఆలయాన్ని సందర్శించారు.
రేణుకాఎల్లమ్మకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పూజలు
కనగల్, జనవరి 28: జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ఆమె అత్తగారు ఝాన్సీరెడ్డి ఇతర కుటుంబసభ్యులు ఆదివారం దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్ల మ్మ ఆలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా అమ్మవారిని దర్వించుకుని ప్రత్యేక పూ జలు జరిపించారు. కాగా అర్చకులు అమ్మవారి ఆశీర్వచనాలను, తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. అంతకుముందు ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఓ శుభకార్యానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు చీదేటి వెంకట్‌రెడ్డి, రాజారెడ్డి, సైదులుగౌడ్, పద్మ, షబ్బీర్ పాల్గొన్నారు.