Share News

మిషన్‌ భగీరథ పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:23 PM

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి అన్నారు.

మిషన్‌ భగీరథ పనులను త్వరగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి

- జడ్పీచైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, జనవరి 12 : మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌లో నిర్వ హించిన జిల్లా ప్రజాపరిషత్‌ 1వ స్థాయీ సంఘం సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడా రు. ఇంకా పనులు ఎక్కడెక్కడ పెండింగ్‌లో ఉన్నాయి ? పనులు చేపట్టకుండా ఎక్కడడెక్క డ మిగిలిపోయాయనే వివరాలను అడిగి తెలు సుకున్నారు. మిషన్‌ భగీరథ, గ్రామపంచాయతీ భవనాలు, సీసీరోడ్లు మిషన్‌ భగీరథ ఇంట్రావిలేజ్‌ విభాగంలో జరి గిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అదేవి ధంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి పెం డింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని కోరారు. కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కి సంబంధించి చెక్‌డ్యామ్‌ నిర్మాణాలు, మిషన్‌ కాకతీయ, విద్యుత్‌శాఖ వ్యవసాయ బావుల బోర్‌ కనెక్షన్‌ దళిత, గిరిజన నివాసాల మౌళిక సదుపాయాలపై చర్చించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జ్యోతి, డిప్యూటీ సీఈవో మున్నీ, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:23 PM