వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:33 PM
వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 1.34 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించగా, భూకంపం లోతు 5 కిలోమీటర్ల లోతు వద్ద నమోదైందని ఎన్‌సీఎస్ అధికారులు మంగళవారం వివరించారు.
రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రత నమోదు
ఒకరోజు ఆలస్యంగా వె లుగులోకి...
వికారాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 1.34 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించగా, భూకంపం లోతు 5 కిలోమీటర్ల లోతు వద్ద నమోదైందని ఎన్‌సీఎస్ అధికారులు మంగళవారం వివరించారు. రిక్టర్ స్కేల్‌పై 4 కంటే తక్కువ తీవ్రతతో నమోదయ్యే భూకంపాలు చిన్నవిగా పరిగణిస్తారు. సోమవారం జిల్లాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో నమోదు కావడం వల్ల ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. వికారాబాద్ జిల్లాలో భూ కంపం, భూప్రకంపనలు సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ చేసిన ప్రకటన చూసి జిల్లా ప్రజలు తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. భూకంపం సంభవించినట్లు తెలిపిన ఎన్‌సీఎస్ అధికారులు వికారాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో వచ్చిందనేది స్పష్టత ఇవ్వలేదు. ఏడేళ్ల కిందట మర్పల్లి మండలంలో భూ ప్రకంపనలు సంభవించగా, మరోసారి జిల్లాలో భూకంపం తక్కువ తీవ్రతతో నమోదు కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకోగా, మంగళవారం వెలుగులోకి రావడం గమనార్హం.