Share News

రైతులకు మొఖం చాటేసి తిరుగుతున్న మంత్రి వెంకట్‌రెడ్డి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:18 AM

: అమలుకాని హామీలు ఇచ్చిన కాంగ్రె్‌స నాయకులు చేతకాని వాళ్లని, జిల్లామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతి సందర్భంలో రైతులకు మొఖం చాటేసి తిరుగుతున్నారని మాజీమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

రైతులకు మొఖం చాటేసి తిరుగుతున్న మంత్రి వెంకట్‌రెడ్డి
అభివాదం చేస్తున్న మాజీమంత్రి, జడ్పీచైర్మన్‌, మాజీ ఎమ్మెల్యేలు

మాజీమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 15: అమలుకాని హామీలు ఇచ్చిన కాంగ్రె్‌స నాయకులు చేతకాని వాళ్లని, జిల్లామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతి సందర్భంలో రైతులకు మొఖం చాటేసి తిరుగుతున్నారని మాజీమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరిలోని ఓ ఫంక్షన్‌హాల్‌ లో సోమవారం జరిగిన భువనగిరి బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాల మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజలను నిలువెల్లా మోసానికి గురి చేసిందన్నారు. ప్రభుత్వాన్ని నడపలేక, కరువును ఎదుర్కోలేక, కరెంట్‌ను సక్రమంగా ఇవ్వకుండా ప్రతిసారీ మాజీ సీఎం కేసీఆర్‌ను ఆడి పోసుకోవడం కాంగ్రెస్‌ నాయకులకు పరిపాటి అయిందన్నారు. 420హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు హామీలు నెరవేరలేదని, ప్రజలు మీ లాగులను ఊడగొడతారని అన్నారు. మార్పు తెస్తామంటే ప్రజలు మీకు(కాంగ్రెస్‌) పట్టం కట్టారని, మార్పు వచ్చిందని భావించిన రైతుల పంటలు ఎండి పోతున్నాయని, దొంగతనాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. మిర్యాలగూడలో ధాన్యం కొనుగోలు మిల్లర్లపై చర్యల గురించి కలెక్టర్‌కు ఇచ్చిన ఆదేశాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర ఇవ్వడం మానేశారని దీనిపై మీ వివరణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డిని ప్రశ్నించారు. మోదీని ఎదిరించిన వ్యక్తి కేసీఆర్‌ అని, కేసీఆర్‌ ముందు కాంగ్రెసోళ్లు గోటికి కూడా పనికిరారన్నారు. 2014 ముందు ఉన్న దుర్భర పరిస్థితులు ప్రస్తుతం కళ్లేదుట కదులాడుతున్నాయన్నారు. ఆడ బిడ్డలు ఖాళీ బిందెలు పట్టుకొని నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి వచ్చిందని తాగు, సాగునీళ్లు లేవని పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా ఓటర్లను చైతన్య పరిచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు సైనికుల్లా పని చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి క్యామ మల్లేశం, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కార్యకర్తలు సమష్ఠిగా సైనికుల వలే పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు జడల అమరేందర్‌గౌడ్‌, కొలుపుల అమరేందర్‌, నల్లమాస రమేష్‌, ర్యాకల శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డి, జనగాం పాండు, ఏవీ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:18 AM