Share News

‘కారుణ్యా’లకు ఓకే

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:58 AM

రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కలలు సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో సాకారమవుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా 178 మంది పూర్వ వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకాలు

‘కారుణ్యా’లకు ఓకే

178మంది వీఆర్వోల కుటుంబాలకు న్యాయం

ఉత్తర్వులు జారీ చేశాం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, కొత్తగూడెం/కల్లూరు, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కలలు సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో సాకారమవుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా 178 మంది పూర్వ వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో, అనేక కారణాలతో మరణించిన 178 మంది వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్న విజ్ఞప్తుల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2020లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా వీఆర్వోలను ఇతర డిపార్ట్‌మెంట్లలో సర్దుబాటు చేస్తున్న క్రమంలో కొందరు వీఆర్వోలు మనోవేదనకు గురై ఆకాల మరణం చెందారు. ఆ కుటుంబాలకు న్యాయం చేసేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కాగా పూర్వ వీఆర్వోల కుటుంబాలకు అర్హతల మేరకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల వీఆర్వోల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఇక, రాష్ట్రంలో రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో గురువారం సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో రెవెన్యూ, భగీరఽథ, పోలీసు, అటవీశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించిందని తెలిపారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు బీఆర్‌ఎ్‌సను వీడి గురువారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఆయనతోపాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు దాదాపు 150మంది కాంగ్రె్‌సలో చేరారు. కంచర్ల గతంలో దాదాపు 20ఏళ్లు కాంగ్రెస్‌ కొనసాగారు.

Updated Date - Mar 01 , 2024 | 03:58 AM