Share News

సందీప్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:53 PM

యాదాద్రిభువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

సందీప్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలి

దేవరకొండ, జనవరి 30: యాదాద్రిభువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో మంగళవారం విలేక రులతో మాట్లాడారు. రుణమాఫీపై అడిగితే ఓపికతో సమాధానం చెప్పా ల్సిన మంత్రి సహనం కోల్పోయి మాట్లాడడం సరికాదన్నారు. ఆరు గ్యారెం టీలను వంద రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆ హామీలు అమలు చేయాలని అడిగిన ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడే వ్యవహారశైలి సరికాదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు టీవీఎన్‌ రెడ్డి, హనుమంతు వెంకటేష్‌గౌడ్‌, సుభాష్‌, గాజుల ఆంజనేయులు, రాజేష్‌, అనంతగిరి, ప్రతాప్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, మల్లారెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.

సూర్యాపేట(కలెక్టరేట్‌): మంత్రి వెంకట్‌రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులను అవమానించి, దాడులకు ఉసిగొల్పుతున్నారని బీఆర్‌ఎస్‌ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయా దవ్‌ అన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించినందుకు భువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డిపై దాడి చేయించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులతో ఏకమై గూండాయిజం చేయడం తగద న్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే దాడి చేస్తారా అని జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, నెమ్మాది భిక్షం, ఉప్పల ఆనంద్‌, కోడి సైదులుయాదవ్‌ పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ టౌన్‌: జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జడ్పీచైర్మన్‌ను అవమానించే విధంగా మంత్రి మాట్లాడడం తగదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు డిల్లీ మాధవరెడ్డి, ముప్పిడి శ్రీనివాస్‌, బొడిగే ఆనంద్‌, మల్లేశ్‌ పాల్గొన్నారు.

నల్లగొండ టౌన్‌: యాదాద్రి జడ్పీచైర్మన్‌ సందీప్‌రెడ్డిపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాకేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లపై మాట్లాడే నైతిక హక్కు మంత్రి కోమటిరెడ్డికి లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు నోముల శంకర్‌యాదవ్‌, బాషబోయిన లింగస్వామి, క్రాంతి కుమార్‌, గంట కిరణ్‌, గణేష్‌, శ్రీకాంత్‌, నానియాదవ్‌, శివకుమార్‌, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

భువనగిరి రూరల్‌: ప్రభుత్వ కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో పక్షపాత ధోరణితో వ్యవహరించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ రవిగుప్తాకు బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల బృందం మంగళవారం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగంపై ప్రశ్నిస్తున్న జడ్పీచైర్మన్‌పై స్థానిక పోలీస్‌ అధికారులు దురుసుగా వ్యవహరించడం సరి కాదన్నారు. విచారణ చేపట్టి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బండా నరేం దర్‌రెడ్డి గుజ్జ దీపిక, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లబోతు భాస్కర్‌రావు శానంపూడి సైదిరెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఉన్నారు. అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని యాదాద్రిభువనగిరి జడ్పీ వైస్‌చైర్మన్‌ ధనావత్‌ భీకూనాయక్‌ డిమాండ్‌ చేశారు. జడ్పీ కార్యాలయంలో భువనగిరి, యాద గిరిగుట్ట, రాజాపేట జడ్పీటీసీలు సుబ్బూరు బీరు మల్లయ్య, తోటకూరి అనురాధ, చామకూర గోపాల్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధి కారంలోకి వచ్చి రెండు నెలలు గడువక ముందే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. మంత్రికి సమాన హోదా కలిగిన జడ్పీ చైర్మన్‌ను అవమాన పర్చడం సరికాదన్నారు.

బొమ్మలరామారం: మంత్రి వెంకట్‌రెడ్డి జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డిని కించపరిచే వాఖ్యలు చేయడం సరికాదని బీఆర్‌ఎస్‌ మండల నాయకులు అన్నారు. జడ్పీచైర్మన్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మం డలకేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చే శారు. సందీప్‌రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చే యడం సరికాదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొల గోని వెంకటేష్‌గౌడ్‌, ఎంపీపీ సుధీర్‌రెడ్డి, గూదె బాలనర్సింహ పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లి: జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూషించడం సరికాదని ఎంపీపీ మాడ్గుల ప్రభా కర్‌రెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. అహం కార పూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాటి సుధాకర్‌రెడ్డి, సీత వెంకటేశం, కోట మల్లారెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్‌ పాల్గొన్నారు.

మంత్రి కోమటిరెడ్డిని విమర్శించడం తగదు : బీర్ల

తుర్కపల్లి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మాజీమంత్రి జగదీ్‌షరెడ్డి, జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడిని ఇష్టారాజ్యంగా విమర్శించడం సిగ్గుచేటని, మాజీమంత్రికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

మంత్రి కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

బొమ్మలరామారం: జడ్పీ చైర్మన్‌గా ఉంటూ సొంత గ్రామానికి రోడ్డు కూడా వేయలేని సందీప్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్‌ మండల నాయకులు అన్నారు. మండల కేం ద్రంలో జడ్పీచైర్మన్‌ సందీప్‌రెడ్డి దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. సొంత గ్రామం వడపర్తి నుంచి చీకటిమామిడి వరకు డబుల్‌ రోడ్డు వేస్తానని హామీ ఇచ్చి నెర వేర్చలేని సందీప్‌రెడ్డి మంత్రిపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు మర్రి భగవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, దేశెట్టి చంద్రశేఖర్‌, రఘు, బాసరమ్‌ బాబు, కుమార్‌, మహేష్‌గౌడ్‌, యాదయ్య, హేమంత్‌రెడ్డి, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:53 PM