Share News

కార్మికులకు కనీస వేతనాలు పెంచాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:28 AM

పెరుగుతు న్న ధరలకు అనుగుణం గా కనీస వేతన చట్టా న్ని సవరించి కార్మికుల వేతనాలను పెంచాలని వ్యవసాయ కార్మిక సం ఘం రాష్ట్ర కార్యదర్శి నా రి అయిలయ్య డిమాం డ్‌ చేశారు.

 కార్మికులకు కనీస వేతనాలు పెంచాలి
నేరడలో సభ్యత్వాలను అందస్తున్న అయిలయ్య

కార్మికులకు కనీస వేతనాలు పెంచాలి

చిట్యాలరూరల్‌, మార్చి 10: పెరుగుతు న్న ధరలకు అనుగుణం గా కనీస వేతన చట్టా న్ని సవరించి కార్మికుల వేతనాలను పెంచాలని వ్యవసాయ కార్మిక సం ఘం రాష్ట్ర కార్యదర్శి నా రి అయిలయ్య డిమాం డ్‌ చేశారు. మండలంలో ని నేరడలో ప్రజాసంఘాల సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోజురోజుకు అన్ని ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని నిత్యం కష్టపడి పనిచేసే కార్మికుల వేతనాలు మాత్రం ఏమాత్రం పెరగకపోవడం దారుణ మని, ఇది ప్రభుత్వాల అసమర్థత అని విమర్శించారు. కరువుతో పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటీవల జ రిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను సీఎం రేవంతరెడ్డి నెరవేర్చాల ని కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అ ఽధ్యక్షుడు బొజ్జ చినవెంకులు, నాయకులు జిట్ట నగేష్‌, జిట్ట సరోజ, ఐతరాజు న ర్సింహ, కల్లూరి కుమారస్వామి, కందగట్ల గణేష్‌, సంకోజు నర్సింహాచారి, కల్లూ రి క్షత్రయ్య, లక్ష్మయ్య, ఈశ్వరాచారి, శంకరాచారి, లక్ష్మణ్‌, వెంకన్న, విజయ్‌కుమా ర్‌, భిక్షం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:29 AM