మిడ్‌మానేరు వెలవెల
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:17 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మిడ్‌మానేరు ప్రాజెక్టు నీళ్లు లేక వెలవెలబోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మానేరువాగుపై నిర్మించిన రాజరాజేశ్వర
ప్రాజెక్ట్ సామర్థ్యం 27.50 టీఎంసీలు.. ప్రస్తుత నిల్వ 8.27 టీఎంసీలు
సిరిసిల్ల, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మిడ్‌మానేరు ప్రాజెక్టు నీళ్లు లేక వెలవెలబోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మానేరువాగుపై నిర్మించిన రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్ సామర్థ్యం 27.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.27 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసిన నీళ్లతో గతంలో మిడ్ మానేరు నిత్యం జలకళతో ఉండేది. కానీ, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కుంగిపోవడంతో ఆ ప్రభావం మిడ్‌మానేరుపై పడింది. నీటి నిల్వలు లేక మిడ్‌మానేరు వద్ద ఎత్తిపోతలు ఆపేయడంతో జిల్లాలోని 3.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన అన్నపూర్ణ ప్రాజెక్టులో నీటి నిల్వలు 0.83 టీఎంసీలకు పడిపోయాయి. దీంతో సమీపంలో చెరువులు, కుంటలు కూడా ఎండిపోయాయి. మరోపక్క, మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పడిపోవడంతో ఒక్కొక్కటిగా బయటపడుతున్న ముంపు గ్రామాల శిథిలాలు నిర్వాసితులను కంటతడి పెట్టిస్తున్నాయి.