Share News

త్వరలోనే కేసీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు!

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:08 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దగ్గర రాజకీయ నాయకులెవరూ మనుగడ సాగించలేరని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆయన దగ్గర ఉన్నవారంతా

త్వరలోనే కేసీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు!

ట్యాపింగ్‌తోనే 39 సీట్లు గెలిచారు

త్వరలో బీజేపీలోకి హరీశ్‌: ఎమ్మెల్యే రాజగోపాల్‌

చేర్యాల, ఏప్రిల్‌ 29: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దగ్గర రాజకీయ నాయకులెవరూ మనుగడ సాగించలేరని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆయన దగ్గర ఉన్నవారంతా బ్రోకర్లు, జోకర్లేనని చెప్పారు. భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా సోమవారం చేర్యాలలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం అంగడిబజారులో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో పాటు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసు వాహనాల్లో డబ్బు తరలించి అడ్డగోలుగా పంచి, 39 సీట్లు గెలిచారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, అధికార దుర్వినియోగం కేసు విచారణలో ఒక్కో అంశం బయట పడుతోందన్నారు. త్వరలోనే కేసీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కాబోతుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం కాళేశ్వరం అవినీతిలో ఎమ్మెల్యే హరీశ్‌రావు జైలుకు పోతాడని అన్నారు. బీఆర్‌ఎస్‌ పనైపోయిందని, త్వరలోనే హరీశ్‌రావు బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు.

Updated Date - Apr 30 , 2024 | 04:08 AM