Share News

మాజీ న్యాయమూర్తి చంద్రఘోష్‌తో రాష్ట్ర నీటిపారుదల అధికారుల భేటీ

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:26 AM

కాళేశ్వరం లోపాలపై న్యాయవిచారణ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షతో రాష్ట్ర నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్‌సీ

మాజీ న్యాయమూర్తి చంద్రఘోష్‌తో రాష్ట్ర నీటిపారుదల అధికారుల భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం లోపాలపై న్యాయవిచారణ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షతో రాష్ట్ర నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్‌సీ (పీఅండ్‌ఎం) కె. శ్రీనివాస్‌ మంగళవారం కోల్‌కతాలో భేటీ అయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలకు గల కారకులను గుర్తించడానికి వీలుగా న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయాన్ని వివరిస్తూ విచారణ విధి విధానాలను ఆయనకు అందించారు. కమిషన్‌ కార్యాలయాన్ని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని 8వ అంతస్తులో ఏర్పాటు చేస్తున్నామని, దానికి అవసరమైన మరమ్మతులు త్వరలోనే పూర్తిచేసి సమాచారం అందిస్తామని చెప్పారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ), ఆఫీస్‌ సబార్డినేట్‌, సూపరింటెండెంట్‌ తదితర ఉద్యోగులతో పాటు ముగ్గురు న్యాయవాదులను కమిషన్‌కు సమకూర్చనున్నామని అధికారులు జస్టిస్‌ చంద్రఘో్‌షకు వివరించారు. దానికి ఆయన స్పందిస్తూ త్వరలోనే హైదరాబాద్‌కు వస్తానని బదులిచ్చారు.

Updated Date - Apr 03 , 2024 | 02:26 AM