‘వైద్య విద్య యుద్ధం’ సక్సెస్!
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:28 AM
ఆ వైద్య విద్యార్థుల లక్ష్యం పూర్తయింది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపి.. వైద్యవిద్యను మధ్యలోనే వదిలేసి భారత్‌కు తిరిగొచ్చిన ఆ విద్యార్థులు,

రష్యా వార్‌తో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వైద్య విద్యార్థులు
ఉజ్బెకిస్థాన్‌లో మిగతా విద్యను పూర్తిచేసే అవకాశం
అక్కడ ఎంబీబీఎ్‌సను పూర్తిచేసిన 81 మంది
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఆ వైద్య విద్యార్థుల లక్ష్యం పూర్తయింది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపి.. వైద్యవిద్యను మధ్యలోనే వదిలేసి భారత్‌కు తిరిగొచ్చిన ఆ విద్యార్థులు, ఉజ్బెకిస్థాన్‌లో ఎంబీబీఎ్‌సను పూర్తిచేశారు. ఈ మేరకు మంగళవారం గచ్చిబౌలిలోని ఏఐజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమంలో 81మందికి పట్టాలు పంపిణీ చేశారు. అప్పట్లో యుద్ధంతో ఉక్రెయిన్‌లో భీతావహ పరిస్థితులు నెలకొనడంతో 210 మంది వైద్య విద్యార్థులు రెండో సెమిస్టర్ మధ్యలోనే స్వదేశానికి తిరిగొచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకున్న భారత ప్రభుత్వం, ఉజ్బెకిస్థాన్ విదేశీ మంత్రిత్వశాఖతో మాట్లాడి ఆ దేశంలో వైద్య విద్యను పూర్తిచేసేందకు అవకాశం కల్పించింది. వీరిలో 110 మంది ఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాయగా, 81 మంది తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు.