Share News

Kumaram Bheem Asifabad- తాగునీరు అందించేందుకు చర్యలు

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:01 PM

మండలంలోని మారుమూల గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిపాబాద్‌ డీఎల్‌పీవో ఉమర్‌ హుస్సేన్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని వెంకటాపూర్‌, బల్హాన్‌పూర్‌, ఒడ్డెఘాట్‌ గ్రామాలను సందర్శించారు.

Kumaram Bheem Asifabad-    తాగునీరు అందించేందుకు చర్యలు
బోర్‌వెల్‌ను పరిశీలిస్తున్న డీఎల్‌పీవో ఉమర్‌ హుస్సేన్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 30: మండలంలోని మారుమూల గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిపాబాద్‌ డీఎల్‌పీవో ఉమర్‌ హుస్సేన్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని వెంకటాపూర్‌, బల్హాన్‌పూర్‌, ఒడ్డెఘాట్‌ గ్రామాలను సందర్శించారు. ఒడ్డెఘాట్‌లో మే 21 నుంచి 24 వరకు జాతర ఉన్న నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డీఎల్‌పీఓ దృష్టికి తీసుకు రాగా ట్యాంకర్ల ద్వారా జాతర సమయంలో తాగునీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆయా గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించారు.

Updated Date - Apr 30 , 2024 | 11:01 PM