Share News

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:20 PM

జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముం దస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 6 : జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముం దస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని కాన్పరెన్స్‌ హాలులో తాగునీటి సరఫరా అంశంపై అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే రెండు నెలల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి బాధ్యతతో పని చేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలస్థాయి అధికారులు అందరు ప్రతీరోజు నాలుగు గ్రామాలను సందర్శించి ఎల్లోజోన్‌, ఆరెంజ్‌జోన్‌ వివరాలను అందజేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలువకుండా గ్రామాలలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట చేతిపంపులు, బోరు మోటార్లు, పైప్‌లైన్‌ల మరమ్మత్తులు చేపట్టి నీటి సరఫరాను సక్రమంగా నిర్వహించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని వచ్చే రెండు నెలలు ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌, మిషన్‌ భగీరథ ఈఈ శ్రీధర్‌రెడ్డి, జడ్పీ సీఈవో కాంతమ్మ, డీఆర్‌డీవో నర్సింగరావు, డీపీవో వెంకట్‌రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్‌ భగీరఽథ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:20 PM