సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:14 PM
వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.

- డ్రై డే సందర్భంగా పారిశుధ్య పనులను పరిశీలించిన కలెక్టర్
మహబూబ్‌నగర్, జూలై 5 : వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం డ్రై డేను పుర స్కరించుకుని కలెక్టర్ పట్టణంలోని జగ్జీవన్‌రామ్ నగర్‌లో పారిశుధ్య పనులను పరిశీలించారు. మురుగు కాలువలు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. మురుగు కాలువల్లో నీరు ప్రవహించేలా చెత్త లేకుండా చూసుకోవాలని తెలి పారు. కాలనీ ప్రజలతో మాట్లాడారు. ప్రజలు ఇంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లు, మురుగుకాలువలలో చెత్త వేయవద్దని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని, ఇళ్లలో ఉన్న పూలతొట్లు, కూలర్లు, టైర్లు, కొబ్బరిబోండాలలో నీరు నిలువలేకుండా ఖాళీ చేయాలన్నారు. లేదంటే అందులో దోమలు ప్రబలి వ్యాధులు వ్యాపిస్తాయ న్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డేని పాటించి ఇంటి ఆవరణలో నీటి నిలువలను తొలగించుకోవాలని సూచించారు. కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్‌ను పరిశీ లించిన కలెక్టర్ లైటింగ్, డోర్లు ఏర్పాటుచ ేయాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజలను అప్రమత్తం చేయాలి : డీఎంహెచ్‌వో
భూత్పూర్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ స్థానిక వైద్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. ఫ్రైడే, డ్రైడే సందర్భంగా శుక్రవారం మునిసిపాలిటీలోని అమిస్తాపూర్ గ్రామంలోని ఏడవ వార్డులో మండల వైద్యాధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ అబ్దుల్ రబ్, సీహెచ్‌వో ఆయూఫ్‌ఖాన్, హెల్త్ అసిస్టెంట్ ప్రమోద్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.