అంటురోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:33 PM
వర్షాకాలం ప్రారంభమైనందున రోడ్ల మీ ద నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్చిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి ఆదేశించారు.

- జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 12 : వర్షాకాలం ప్రారంభమైనందున రోడ్ల మీ ద నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్చిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్లపై, గుంతలలో నిలిచిన మురికి నీరు వల్ల ఈగలు, దో మలు అధికమై ప్రజలు అనారోగ్యానికి గురైపోతారని పేర్కొన్నారు. కనుక మురి కి నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని 5, 1 స్థాయీ సంఘం సమావేశాలలో అధికారులను ఆదేశించారు. వివిధ మండ లాల్లో ప్రభుత్వం నుంచి మంజూరైన పనుల ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులలో నాణ్యత ఉండాలని, అలాగే త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వసతి గృహంలో అర్హులకు సీట్లు ఇవ్వాలి
ప్రభుత్వ వసతి గృహంలో అర్హులైన విద్యార్థులందరికీ సీట్లు వచ్చేలా చూడా లని, వసతి గృహాలు చక్కగా కొనసాగాలని ప్రభుత్వ సంక్షేమంపై నిర్వహించిన స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ జర్పుల కళ్యాణి సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ సీఈవో చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో వసతి గృహాల పని తీరుపై అధికారులతో ఆమె సమీక్షించారు. వసతి గృహంలో చదువుతున్న విద్యా ర్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీది అందజేయాలని కోరారు. భోజనం నాణ్య తతో ఉండాలని, వారికి పుస్తకాలు దుస్తులు వచ్చే విధంగా చూడాలని కోరారు. ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఈ సంవత్సరం వసతి గృహం విద్యార్థుల ఉత్తీర్ణత ఏవిధంగా ఉందో అధికారులను అడిగారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.