Share News

Manchiryāla- ఎంసీహెచ్‌ తరలింపు

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:45 PM

జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌) స్థానిక ఐబీ ఆవరణలోకి మారనుంది. ఈ మేరకు మున్సిపల్‌ సాధారణ సమావేశం తీర్మానించింది. ఆర్‌ అండ్‌ బీ ఆధీనంలో ఉన్న స్థలాన్ని అప్పగించాలనే ఆదేశాలు సైతం ఇటీవల జారీ అయ్యాయి.

Manchiryāla-       ఎంసీహెచ్‌ తరలింపు
మాతాశిశు సంరక్షణ కేంద్రం

మంచిర్యాల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌) స్థానిక ఐబీ ఆవరణలోకి మారనుంది. ఈ మేరకు మున్సిపల్‌ సాధారణ సమావేశం తీర్మానించింది. ఆర్‌ అండ్‌ బీ ఆధీనంలో ఉన్న స్థలాన్ని అప్పగించాలనే ఆదేశాలు సైతం ఇటీవల జారీ అయ్యాయి. మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలోని గోదావరి ఒడ్డున గల ప్రభుత్వ స్థలంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. రూ.17 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టారు. మూడు ఏళ్ల క్రితం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నుంచి తరలించారు. అనంతరం 2022 జూలై 13న కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ఆస్పత్రి భవనం పూర్తిగా నీట మునిగింది. దీంతో కొద్ది కాలం పాటు తాత్కాలికంగా మూసివేసి మూడు నెలల అనంతరం శుభ్రపరి చిన తరువాత తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. అనంతరం 2023 జూలైలో కురిసిన భారీ వర్షాలకు భవనం మళ్లీ నీటముగింది. ప్రతిసారీ వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటికప్పుడు అందులో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను అసౌకర్యాల నడుమ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలిస్తూ వస్తున్నారు. దీంతో పురుడుపోసుకున్న మహిళలతో పాటు నిండు గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- పనికిరాని భూముల్లో..

ప్రస్తుతం మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ఉన్న భవన స్థలాన్ని మొదట జిల్లా కలెక్టరేట్‌కు కేటాయిస్తూ 2018లో తీర్మానం చేశారు. అప్పటి ఆర్‌ అండ్‌బీ అధికారులు మట్టి పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు లూస్‌ సాయిల్‌గా తేలడంతో కలెక్టరేట్‌ భవన సుముదాయం నిర్మాణానికి పనిరాదని నివేదిక ఇచ్చారు. దీంతో అదే స్థలాన్ని తిరిగి ఎంసీహెచ్‌కు కేటాయించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి పనికిరాని భూములు ఎంసీహెచ్‌కు ఎలా పనికివస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయినప్పటికీ అదే స్థలాన్ని అధికారు లు ఆస్పత్రి భవనానికి ఎంపికచేయడంతో పాటు నిర్మాణం కూడా పూర్తి చేశారు. అదే సమయంలో ఊహించనివిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం రూపుదిద్దుకోవడం, వర్షాకాలంలో గోదావరి నది ఉప్పొం గడం జరిగాయి. దీంతో ఏటా ఎంసీహెచ్‌ భవనం నీట మునుగుతుం డగా, వైద్య సేవల కోసం వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి ఒడ్డున ఎంసీహెచ్‌ నిర్మించడం సరైన నిర్ణయం కాదని, అప్పట్లోనే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు తీవ్రంగా విబేధించారు. ఎంసీహెచ్‌ భవనాన్ని ఐబీ విశ్రాంత భవనం ఆవరణలో నిర్మించాలని సూచనలు చేశారు. దానికి భిన్నంగా అధికా రులు, పాలకులు ఆ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణా నికి పూనుకున్నారు. గతంలో ఆర్‌ అండ్‌ బి అతిథిగృహానికి సదరు స్థలాన్ని కేటాయించగా, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం కారణంగా మున్సిపాలి టీకి కేటాయిస్తూ అప్పట్లో తీర్మానం చేశారు. దీంతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ సముదాయం పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం నిర్మాణ ద శలో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం మారడం, అప్పట్లో సమీకృత భవనా నికి కేటాయింంచిన స్థలంలోనే ఎంసీహెచ్‌ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేసిన ప్రేమ్‌సాగర్‌రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండడంతో ఎంసీహెచ్‌ నిర్మాణ స్థల మార్పుకు మార్గం సుగమమం అయ్యింది.

ప్రజల కోరిక మేరకు..

ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఎంసీహెచ్‌ భవన విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో మొదటి నుంచి పట్టుదలతో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు ప్రజలు కోరుకున్నవిధంగానే ఆస్పత్రిని ఐబీ స్థలంలోకి తరలించేందుకు సుగమం చేశారు. ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలని నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ఆస్పత్రికి కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన మున్సిపల్‌ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. దీంతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు నిలిచిపోనుండగా, అదేస్థలంలో ఎంసీహెచ్‌ భవనాన్ని నిర్మించనున్నారు. సదరు స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించాలనే తుది నిర్ణయం కూడా జరిగింది. దీంతో గోదావరి ఒడ్డున ఉన్న ఎంసీహెచ్‌ను ఐబీకి తరలించేందుకు మార్గం సుగమం అయ్యింది.

తొలగనున్న కష్టాలు..

గోదావరి ఒడ్డున ఉన్న ఎంసీహెచ్‌ భవనం ఐబీ వద్దకు తరల నుం డడంతో మహిళల కష్టాలు తీరుతాయనే భావన అన్ని వర్గాల్లో నెలకొం ది. మాతా, శిశు కేంద్రంలో జిల్లావాసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన మహిళలు కూడా ప్రసవం కోసం వస్తుంటారు. బాలింతలు, నిండు గర్భిణులు వివిధ ప్రాంతాల నుంచి గోదావరికి వెళ్లే రోడ్డులోని స్పీడ్‌ బ్రేకర్లను దాటుతూ ఎంసీహెచ్‌కు చేరడం ఇబ్బందిగా మారింది. అత్యవసర సమయాల్లో ప్రయాణించే వీలులేని చోట ఆస్పత్రి ఉండ డంతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తీర్మానం చేసిన మేరకు ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలోని స్థలాన్ని ఎంసీహెచ్‌ భవనానికి కేటాయించనున్నారు. దీంతో రవాణా సుల భతరం కానుంది. ప్రతిపాదిత స్థలం ముందు ఆర్టీసీ బస్టాప్‌ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు నేరుగా ఆస్పత్రిలోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. పైగా ప్రస్తుతం కేటాయించిన స్థలానికి ఎదురుగానే ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఉండడంతో మహిళల కుటుంబ సభ్యులకు కూడా చికిత్స అందుబాటులో ఉండనుంది. ఆస్పత్రి ముందే బస్సు దిగనుండడంతో ఆటోల రూపేణా రవాణా ఖర్చులు ఆదా కానున్నాయని ప్రజలు చెబుతున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:45 PM