Share News

మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం సీజ్‌

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:30 AM

సార్వత్రిక ఎన్నికల వేళ ఏవోబీ(ఆంధ్రా ఒడిసా సరిహద్దు ప్రాంతం)లో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్‌ చేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల సమీపాన ఒడిశా రాష్ట్రంలోని సుంకి ప్రాంతం దట్టమైన అడవుల్లో ఆదివారం సాయంత్రం ఆ ఆయుధ తయారీ

మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం సీజ్‌

మన్యం జిల్లా వద్ద దట్టమైన అడవిలో గుర్తింపు

హేండ్‌ బౌలర్‌, కత్తులు తదితరాలు స్వాధీనం

సాలూరు రూరల్‌, మార్చి 25: సార్వత్రిక ఎన్నికల వేళ ఏవోబీ(ఆంధ్రా ఒడిసా సరిహద్దు ప్రాంతం)లో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్‌ చేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల సమీపాన ఒడిశా రాష్ట్రంలోని సుంకి ప్రాంతం దట్టమైన అడవుల్లో ఆదివారం సాయంత్రం ఆ ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఆ వివరాలను బీఎ్‌సఎఫ్‌ సీవోబీ డి.కాయ్‌ 65 బెటాలియన్‌కు చెందిన కమాండ్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌ కెర్‌కెట్టా సోమవారం ఒడిశా మీడియాకు వెల్లడించారు. ఆయుధ తయారీ కేంద్రం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంతాం బడేవలస, పద్మాపురం గ్రామాలకు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలోని సుంకి క్యాంప్‌ బీఎ్‌సఎఫ్‌ జవాన్లు ఏవోబీ అడవుల్లో ఆదివారం గాలింపు చేపట్టారు. ఆ సమయంలో ఏవోబీ సరిహద్దు వద్ద సంచరిస్తున్న ఇద్దరిని వారు ప్రశ్నించారు. దీంతో ఆయుధ తయారీ కేంద్రం గురించి తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకున్న జవాన్లు తుపాకీ తయారీకి వినియోగించే హేండ్‌ బౌలర్‌, టిగ్గర్‌ మెకానిజం, ఫిల్లర్లు, హేమర్‌, స్లీపర్‌, చేజల్‌, ఫైల్‌, కత్తులు, ఇనుప బిట్‌, రంపం తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏపీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు, ఏవోబీకి వెళ్లే పి.కోనవలస, దండిగాం, పద్మాపురం తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 09:56 AM