Share News

గజవాహన సేవలో మన్యంకొండ వేంకటేశ్వరస్వామి

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:17 PM

మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాలలో భాగంగా మంగళవారం ఆలయంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి గజవాహన సేవలో ఊరేగారు.

గజవాహన సేవలో మన్యంకొండ వేంకటేశ్వరస్వామి
గజవాహన సేవలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి

మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 20 : మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాలలో భాగంగా మంగళవారం ఆలయంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి గజవాహన సేవలో ఊరేగారు. ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్‌ కుమార్‌, అర్చకులు, స్వామివారిని అలంకరించి అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం పల్లకిలో గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస రాజు, అడిషనల్‌ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్‌, ఆలయ వంశపార ధర్మకర్త రామకృష్ణ, సూపరింటెండెంట్‌ నిత్యానందం, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:17 PM