Share News

మాన్యు ఫాక్చరింగ్‌ యూనిట్లు పెరగాలి: దుద్దిళ్ల

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:11 AM

రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు పెరగాల్సిన అవసరం ఉందని, ఇదే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మాన్యు ఫాక్చరింగ్‌ యూనిట్లు పెరగాలి: దుద్దిళ్ల

రాయదుర్గం, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు పెరగాల్సిన అవసరం ఉందని, ఇదే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నానక్‌రాంగూడలో మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ) నూతన కార్యాలయాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎంఈఐసీ ఉండవల్ల నగరం మెడ్‌టెక్‌ ఆవిష్కరణకు హాట్‌స్పాట్‌గా మారిందని చెప్పారు. వైద్య రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా రోబోటిక్‌ సర్జరీలు బాగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. మెడ్‌ట్రానిక్‌ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెడక్‌ట్రానిక్‌ చైర్మన్‌, సీఈవో జెఫ్‌మార్తా, ఎంఈఐసీ ఉపాధ్యక్షుడు సైద్‌లీడర్‌ దివ్యప్రకాశ్‌జోషి మాట్లాడారు.

ఫోర్సీస్‌ ఇంక్‌ నూతన కార్యాలయం ప్రారంభం

నానక్‌రాంగూడలో ఫోర్సీస్‌ ఇంక్‌ నూతన కార్యాలయాన్ని మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుడులు పెంచేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నీఫర్‌, ఐల్యాబ్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ శ్రీనివాసరరాజు, స్టార్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 04:11 AM