Share News

దేశ రైతుల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్‌సింగ్‌దే

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:23 AM

దేశం మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కే దక్కిందని భారీ నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొని యాడారు.

దేశ రైతుల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్‌సింగ్‌దే

నీటిపారుదల, శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశం మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కే దక్కిందని భారీ నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొని యాడారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలోనే లక్షలాది మంది గిరిజనులకు, ఆదివాసీలకు అటవీ భూములపై హక్కులు కల్పించారని కొనియారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో జాతీయ సలహా కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీని నియమించి ఆమె సలహాలు, సూచనలు స్వీకరించి దేశాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కూలీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి కోట్లాది మంది భారతీయులకు పనికల్పించారన్నారు. మాజీ ప్రధాని పీవీ. నర్సింహారావు హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తుచేశారు. సివిల్‌ న్యూక్లియర్‌ ప్రవేశపెట్టాలని సూచించినప్పుడు దేశాభివృద్ధికి పూర్తి సహకారం అందించాలన్నారు. మనోహ్మన్‌సింగ్‌ ఒక గొప్ప ఆర్థికవేత్త, నిజాయితీపరుడని, సామాన్య జీవితాన్ని గడిపిన వ్యక్తి అని అన్నారు. ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించి బిల్లు ఆమోదం తెలపడంతో ప్రముఖపాత్ర పోషించారన్నారు. మన్మోహన్‌సింగ్‌ మృతి దేశప్రజలకు తీరనిలోటని మంత్రి అన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:23 AM