ముగిసిన మల్లిఖార్జున స్వామి జాతర ఉత్సవాలు
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:44 AM
గొల్లపల్లి మండలం మల్లన్న పేట మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పోటిత్తింది. జాతర ఉత్సవాలు ఏడు వారాల పాటు వైభవంగా జరిగి ఆదివారం ఘనంగా ముగిశాయి.
ఆఖరి రోజు పోటేత్తిన భక్తులు
స్వామికి బోనాల సమర్పణ..
గొల్లపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : గొల్లపల్లి మండలం మల్లన్న పేట మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పోటిత్తింది. జాతర ఉత్సవాలు ఏడు వారాల పాటు వైభవంగా జరిగి ఆదివారం ఘనంగా ముగిశాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు బెల్లం పానకంతో వం డిన బోనాలను నెత్తిన ఎత్తుకుని శివసత్తుల పూనకాల నడుమ ఆలయం వద్దకు ఊరేగింపుగా తరలివచ్చారు. బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామికి బోనాలు సమర్పిం చారు. ఆలయ పూజారులు కొండూరి రాజేంధర్ శర్మ, కొండూరి రఘునందన్ శర్మ వేధమం త్రోచ్ఛరణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు. అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక దర్శ నానికి విక్రయించిన టికెట్ల ద్వారా ఆలయానికి రూ. 39,940 ఆదాయం సమకూరినట్లు ఆల య పౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య తెలిపారు. జాతరలో ఎస్సై చిర్ర సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మండల వైద్యాధికారి డా. నరేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. జాతర ఉత్సవాలను ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్, ఆల య ఈవో విక్రమ్, ఆలయ పౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య పర్యవేక్షించారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ఈవో విక్రమ్, తాజామాజీ ప్రజా ప్రతినిధులు సిద్దంకి నర్సయ్య, గోస్కుల రాజన్న, భేర కిషోర్, బీఆర్‌ఎస్వీ మండల శాఖ అధ్యక్షులు ఆవారి చందు, నాయకులు సిద్దం కి మల్లయ్య, భీమ సత్తయ్య, కడమండ సుధాకర్, మామిడిపెల్లి పోచమల్లయ్య, భీమ మహేష్, దాసరి మల్లయ్య,
జాతర ఉత్సవాల ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతిలక్ష్మణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొదటి సారి ఆలయా న్ని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్‌ను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.