Share News

తాగునీటి సమస్య రాకుండా చూసుకోండి

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:53 PM

వేసవి ప్రారంభమైనందున పట్టణ ప్రజలకు తాగు నీటి సమస్య రాకుండా చూసుకోవాలని ఇందుకోసం ముందస్తు ప్రణాళిక రూపొందించా లని మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు.

తాగునీటి సమస్య రాకుండా చూసుకోండి
తాగునీటి పంపింగ్‌ రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ అనంద్‌గౌడ్‌

- అధికారులకు సూచించిన మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 17 : వేసవి ప్రారంభమైనందున పట్టణ ప్రజలకు తాగు నీటి సమస్య రాకుండా చూసుకోవాలని ఇందుకోసం ముందస్తు ప్రణాళిక రూపొందించా లని మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయ న పట్టణ సమీపంలోని రామిరెడ్డిగూడెం తాగునీటి పంపింగ్‌ రిజర్వాయర్‌, మోటార్లు, ఫిల్ట ర్‌ బెడ్‌లను అధికారులు, కౌన్సిలర్‌లతో కలిసి పరిశీలించారు. ఎక్కడైనా పైపులు లీకేజీ ఉ న్నా, మోటార్లు మరమ్మతులు ఉన్నా పూర్తిస్థాయిలో సరిచేసి సమ్మర్‌కు సిద్ధం చేసి ఉం చుకోవాలని సూచించారు. పట్టణంలోని అన్ని వార్డులలో తాగునీటిపై పర్యవేక్షణ చేయా లని, ఎక్కడ లోపాలున్నా వాటిని వెంటనే సరిచేయాలని అధికారులకు సూచించారు. కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఎంఈ బస్వరాజు, వైస్‌చైర్మన్‌ షబ్బీర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఫ శానిటేషన్‌ మెరుగుపడాలి : అంతకుముందు మునిసిపల్‌ కార్యాలయంలో శానిటేష న్‌ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్‌లు, జవాన్‌లతో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌ సమీక్ష నిర్వహించారు. శానిటేషన్‌ విషయంలో బాగానే పనిచేస్తున్నా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటింటికీ చెత్త సేకరణ బాగా చేయాలని, ఓపెన్‌ ప్లాట్లలో చెత్త, ప్లాస్టిక్‌ కవర్లు జమకాకుండా చూడాలని సూచించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత పారిశుధ్య కార్మికులదేనని చెప్పారు.

Updated Date - Feb 17 , 2024 | 11:53 PM