Share News

సీఎం సభను విజయవంతం చేయండి

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:51 PM

ఈ నెల 6న పాలమూరులో నిర్వహించే ప్రజా దీవెన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదీవెన సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

సీఎం సభను విజయవంతం చేయండి

షాద్‌నగర్‌, మార్చి 4: ఈ నెల 6న పాలమూరులో నిర్వహించే ప్రజా దీవెన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదీవెన సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పాలమూరులో నిర్వహించే ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. పదేళ్లుగా ప్రజల సమస్యలను కళ్లారా చూసిన సీఎం రేవంత్‌రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాల్లో నాలుగింటిని అమలు చేస్తుందని, పరిపాలన పరంగా ఉన్న ఇబ్బందులను అధికమించి త్వరలోనే మరో 2 గ్యారెంటీలను కూడా అమలు చేయనుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ చేపట్టిన న్యాయ యాత్రకు ప్రజాదీవెన సభ బాసటగా నిలుస్తుందని చెప్పారు.

లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇప్పటి వరకు తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయంపై అప్పటి ప్రజా ప్రతినిధులు, అఽధికారులు కూడా పెద్దగా పట్టించుక్ను దాఖలాలు లేవన్నారు. అర్హులను గుర్తించి జాబితా రూపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు బాబర్‌ఖాన్‌, బాలరాజు గౌడ్‌, రఘు, చెంది తిరుపతిరెడ్డి, కె.చెన్నయ్య, ముబారక్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:51 PM