Share News

మహేశ్వరం.. ఇక మహానగరం!

ABN , Publish Date - Jun 22 , 2024 | 11:24 PM

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఇక మహానగరం కాబోతోంది. రెండు వేల ఎకరాల్లో సా్‌ఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే జపాన్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూడా కుదర్చుకున్నట్లు సమాచారం. పరిశ్రమ ఏర్పాటకు రెండు వేల ఎకరాలు అవసరం కాగా తొలి విడతలో వేయి ఎకరాలు ఇచ్చేందుకు సర్కార్‌ నిర్ణయించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మహేశ్వరానిన బిజినెస్‌ కేంద్రంగా మార్చాలని సర్కార్‌ యోచిస్తోంది. మరో ఐదేళ్లలో ప్రపంచానికి సరిపడా సెల్‌ఫోన్లు ఇక్కడ తయారు కానున్నాయి. ఇక్కడ నుంచే సెల్‌ఫోన్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. మహేశ్వరం పారిశ్రామిక అభివృద్ధితో పాటు టూరిజం, ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌, హెల్త్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహేశ్వరం.. ఇక మహానగరం!

రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కంపెనీ

మొదటి విడతలో జపాన్‌ కపెంనీకి వేయి ఎకరాలు ఇవ్వనున్న సర్కార్‌

నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

టూరిజం, ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌, హెల్త్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ హబ్‌గా..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫార్మాసిటీ వరకు ఏర్పాటు కానున్న మెట్రోలైన్‌

మహేశ్వరాన్ని ’బిజినెస్‌’ కేంద్రంగా చేయాలనేది సర్కార్‌ ఆలోచన

ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో తయారీ కానున్న సెల్‌ఫోన్లు

భూములు కోల్పోయే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ

మహేశ్వరం నియోజకవర్గంలో 14వేల ఎకరాల ప్రభుత్వ భూమి

క్లియర్‌గా 12వేల ఎకరాలు, సమస్యల్లో 2 వేల ఎకరాలు

విదేశీ కంపెనీల రాకకు సమస్యలు లేని ప్రాంతంగా మార్చేందుకు కృషి

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఇక మహానగరం కాబోతోంది. రెండు వేల ఎకరాల్లో సా్‌ఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే జపాన్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూడా కుదర్చుకున్నట్లు సమాచారం. పరిశ్రమ ఏర్పాటకు రెండు వేల ఎకరాలు అవసరం కాగా తొలి విడతలో వేయి ఎకరాలు ఇచ్చేందుకు సర్కార్‌ నిర్ణయించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మహేశ్వరానిన బిజినెస్‌ కేంద్రంగా మార్చాలని సర్కార్‌ యోచిస్తోంది. మరో ఐదేళ్లలో ప్రపంచానికి సరిపడా సెల్‌ఫోన్లు ఇక్కడ తయారు కానున్నాయి. ఇక్కడ నుంచే సెల్‌ఫోన్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. మహేశ్వరం పారిశ్రామిక అభివృద్ధితో పాటు టూరిజం, ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌, హెల్త్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 22 : హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలను అభివృద్ది చేయాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతాలను మూడు క్లష్టర్లుగా విభజించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఔటర్‌ రింగ్‌ రోడు లోపల భాగాన్ని అర్బన్‌ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ క్లస్టర్‌గా, రీజనల్‌ రింగ్‌ రోడ్డు అవతల ప్రాంతాన్ని రూరల్‌ క్లస్టర్లుగా ఏర్పాటు చేయనుంది. ఏ క్లస్టర్లలో ఏది ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే కోకాపేట్‌ ప్రాంతం అభివృద్ధిలో దూసుకు పోయింది. అలాగే మహేశ్వరం కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉండగా అందులో 12 వేల ఎకరాలు ఎలాంటి సమస్యలు లేకుండా క్లియర్‌గా ఉన్నాయి. మరో రెండు వేల ఎకరాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఓఆర్‌ఆర్‌కు బయట, ఆర్‌ఆర్‌ఆర్‌కు లోపల భూములను గుర్తిస్తున్నారు. ఇక్కడ ప్రాంతానికి విదేశీ కంపెనీల రావాలంటే ఎలాంటి సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో భూ సమస్యలు తీర్చాలని నిర్ణయించింది. మహేశ్వరంలో ఇప్పటికే ఎలక్ర్టానిక్‌ సిటీ, ఇండస్ర్టియల్‌ పార్కులు వచ్చాయి. రావిర్యాలలో ఫాక్స్‌ఖాన్‌ కంపెనీ పనులు కొనసాగుతున్నాయి. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే రైతుల నుంచి గత ప్రభుత్వం సుమారు 10 వేల ఎకరాల భూములను సేకరించింది. అయితే, అందులో కొంతమంది రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అలాంటి తప్పులు పునరావృతం కాకూకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. అర్హులైన రైతులకు అన్యాయం జరగొద్దనే ఆలోచనలో ముందుకు సాగుతోంది. భూమి కోల్పోయే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. రెండు రోజుల్లో రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌ అధికారులతో ప్రత్యేక టీం ఏర్పాటు కానున్నట్టు సమాచారం. అధికారులు రైతుల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. భూ భాదితులకు న్యాయం చేసే పనిలో ఉన్నారు. భూమికి భూమి కావాలనుకునే రైతులకు మరోచోట భూమి ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. మరో మూడు, నాలుగు రోజుల్లో వేయి ఎరాల భూమి జపాన్‌ కంపెనీకి ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు చర్చ సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి పార్మా కంపెనీ వరకు మెట్రో లైన్‌ కూడా వేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - Jun 22 , 2024 | 11:25 PM