Share News

నేడో రేపో కాంగ్రెస్‌లోకి మదన్‌రెడ్డి?

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:45 AM

మాజీ సీఎం కేసీఆర్‌ సొంత ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగలనుంది. నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్‌ మిత్రుడు చిలుముల మదన్‌ రెడ్డి బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. నేడో, రేపో కాంగ్రె్‌సలో చేరనున్నట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో

నేడో రేపో కాంగ్రెస్‌లోకి మదన్‌రెడ్డి?

కేసీఆర్‌ ఇలాకాలో బీఆర్‌ఎస్‌కు షాక్‌!

సంగారెడ్డి/కౌడిపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ సొంత ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగలనుంది. నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్‌ మిత్రుడు చిలుముల మదన్‌ రెడ్డి బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. నేడో, రేపో కాంగ్రె్‌సలో చేరనున్నట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరబోతున్న తొలి నాయకుడు మదన్‌రెడ్డి కావడం విశేషం. కాంగ్రెస్‌ నుంచి మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసే అంశాలపై పార్టీ నాయకత్వంతో మదన్‌రెడ్డి చర్చలు జరిపినట్టు తెలిసింది. 2014, 2018 ఎన్నికల్లో నర్సాపూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందిన మదన్‌రెడ్డి గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు పార్లమెంట్‌ టికెట్‌ కూడా ఇవ్వకపోవడంతో మదన్‌ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగా సోమవారం సీఎం రేవంత్‌ ముఖ్య అనుచరుడు ఒకరితో, మంగళవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో చర్చలు జరిపారు. అయితే మెదక్‌ పార్లమెంట్‌ టికెట్‌ కేటాయించే విషయమై కాంగ్రెస్‌ నాయకత్వం స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. మదన్‌ రెడ్డి పార్టీ మారే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి తదితరులు కౌడిపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి ఆయనతో రహస్యంగా మాట్లాడారు. హరీశ్‌ ఎంత నచ్చజెప్పినా వినకుండా మదన్‌రెడ్డి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే మైనంపల్లి హన్మంతరావును కలిశానని మదన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. తనకు ఎంపీ టికెట్‌ ఇస్తామని చెప్పి ఇతరులకు ఇచ్చారన్నారు. అయినా తాను పార్టీ మారడం లేదని చెప్పారు.

Updated Date - Mar 27 , 2024 | 04:45 AM