Share News

మధ్యాహ్న భోజనం.. బకాయిల భారం

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:22 PM

తమకు రావాల్సిన బకాయిల సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మధ్యాహ్న భోజనం.. బకాయిల భారం
భోజనం వండుతున్న ఏజెన్సీలు

- ఉన్నత పాఠశాలలకు సంబంధించి నాలుగు నెలల బిల్లులు పెండింగ్‌

- ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏజెన్సీల నిర్వాహకులు

- త్వరగా నిధులు మంజూరు చేయాలని వేడుకోలు

నారాయణపేట, మార్చి 1: తమకు రావాల్సిన బకాయిల సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నెలల తరబడి నిధులు కేటాయించకపోవడంతో ఆర్థికం గా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 313 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత పాఠశాలలు, 76 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 66వేల పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు జిల్లాలో అ క్టోబరు నుంచి జనవరి వరకు నాలుగు నెలల మధ్యాహ్న భోజనం బిల్లులు అందలేదు. నెలకు రూ. 18లక్షలు చొప్పున రూ. 90లక్షల వరకు బి ల్లులు అందాల్సి ఉన్నది. ప్రాథమిక పాఠశాలలు ఒకటి నంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు డిసెంబరు, జనవరి నెలల బిల్లులు నెలకు రూ. 16 లక్షల చొప్పున రూ. 32 లక్షలు అందాల్సి ఉన్నది. ఫిబ్రవరి నెల ముగియడంతో ఈనెల బిల్లు కూడా అందాల్సి ఉంది. రూ. 1.12 కోట్ల బిల్లులు మధ్యాహ్నభోజన పథకం ఏజెన్సీ లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నెలనెలా బిల్లులు అందక పోవడంతో అప్పుసొప్పు చేసి నెట్టుకు వస్తున్నామని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. నెలనెల డబ్బులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఉన్నత పాఠశాలలకు సంబంధించి నాలుగు నెలల బిల్లులు, ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలలకు సంబంధించి రెండు నెలల బిల్లులు ట్రెజరీకి పంపించి ఈ కుబెర్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ప్రభుత్వం నుంచి క్లియరిన్స్‌ లభించిన వెంటనే ఏజెన్సీ నిర్వాహకుల ఖాతాల్లో జమ అవుతామని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 11:22 PM