Share News

Manchiryāla- ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:51 PM

ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారులందరికీ ఎలాంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు

Manchiryāla-   ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలి
ల్లా కేంద్రంలో నిరసన తెలియజేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఏసీసీ, మార్చి 6: ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారులందరికీ ఎలాంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను పూర్తి ఉచితంగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక దరఖాస్తుదారుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను వంచించడం తగదన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలపై భారం మోపుదామనుకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, ఫ్లోర్‌ లీడర్‌ అంకం నరేష్‌, కౌన్సిలర్లు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చెన్నూరు: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ రెగ్యులరైజేషన్‌కు మంగళం పాడి రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారం మోపుతోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చెన్నూరు పట్టణంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:51 PM