Share News

అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించే అధికారం లోకాయుక్తకు లేదు: హైకోర్టు

ABN , Publish Date - May 09 , 2024 | 05:11 AM

క్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చే అధికారం లోకాయుక్తకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల తొలగించాలంటూ గతంలో లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది.

అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించే అధికారం లోకాయుక్తకు లేదు: హైకోర్టు

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చే అధికారం లోకాయుక్తకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల తొలగించాలంటూ గతంలో లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. చాంద్రాయణగుట్టకు చెందిన సీహెచ్‌ హనుమంతరావు 18-9-9/49 ఇంటి నెంబరు గల ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ అదే ప్రాంతానికి చెందిన అంజమ్మ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన లోకాయుక్త.. అక్రమ నిర్మాణాలు తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హనుమంతరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం.. తెలంగాణ లోకాయుక్త చట్టం-1983 ప్రకారం అక్రమనిర్మాణాలు తొలగించాలని ఆదేశాలిచ్చే అధికారం లోకాయుక్తకు లేదని స్పష్టం చేసింది.

Updated Date - May 09 , 2024 | 08:28 AM