Share News

సీఎం అంటే వైఎస్‌లా ఉండాలి కేసీఆర్‌లా కాదు: కొండా సురేఖ

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:10 AM

ముఖ్యమంత్రి అంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలా ఉండాలని.. కేసీఆర్‌లా కాదని మంత్రి కొం డా సురేఖ అన్నారు. కేసీఆర్‌ అప్పులు చేసి.. చిప్ప చేతికిచ్చారని

సీఎం అంటే వైఎస్‌లా ఉండాలి కేసీఆర్‌లా కాదు: కొండా సురేఖ

గజ్వేల్‌/కొండపాక, ఏప్రిల్‌ 29: ముఖ్యమంత్రి అంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలా ఉండాలని.. కేసీఆర్‌లా కాదని మంత్రి కొం డా సురేఖ అన్నారు. కేసీఆర్‌ అప్పులు చేసి.. చిప్ప చేతికిచ్చారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొడకండ్లలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో, కొండపాకలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ఐదు సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కోడ్‌ ముగిసిన అనంతరం.. ప్రతి హామీని నెరవేరుస్తామని.. పంద్రాగస్టులోగా 2లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, పర్సంటేజీలతో కేసీఆర్‌ కుటుంబం కోట్లు వెనకేసుకుందని దుయ్యబట్టారు.

Updated Date - Apr 30 , 2024 | 04:10 AM