Share News

ప్రశాంత జీవనం గడపాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 10:57 PM

ద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం గడపాలని ఎస్పీ జానకి కోరారు.

ప్రశాంత జీవనం గడపాలి
అధికారిని సన్మానిస్తున్న ఎస్పీ జానకి

- ఉద్యోగ విరమణ పొందిన అధికారికి ఎస్పీ సన్మానం

మహబూబ్‌నగర్‌, జూలై 31 : ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం గడపాలని ఎస్పీ జానకి కోరారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్‌ ఎస్‌ఐ బి.మోహన్‌ను బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 36 ఏళ్ల పాటు పోలీస్‌ శాఖలో సేవ లందించారని తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన అధికారులకు ప్రభుత్వం నుంచి అం దాల్సిన అన్ని రకాల ఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఏవో రుక్మిణిబాయి, సీసీ రాంరెడ్డి, ఆర్‌ఐలు శ్రీను, కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 10:57 PM