Share News

సోనియాను ఏకగ్రీవంగా గెలిపించి రుణం తీర్చుకుందాం

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:59 AM

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా గెలిపించుకుని రుణం తీర్చుకుందామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు.

సోనియాను ఏకగ్రీవంగా గెలిపించి రుణం తీర్చుకుందాం

రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదన

కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌ను కేంద్రమే కాపాడుతుందని ఆరోపణ

మిషన్‌ భగరీథ అవకతవకలపై త్వరలో నివేదిక ఇస్తామని వెల్లడి

వైరా, జనవరి 7: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా గెలిపించుకుని రుణం తీర్చుకుందామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. తెలంగాణ అంటే ప్రేమ ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఇందుకు సహకరించాలని కోరారు. బీఆర్‌ఎ్‌సతో బీజేపీ కుమ్మక్కవ్వడం వల్లే కాళేశ్వరంఅవినీతి అంశంలో కేంద్రం కేసీఆర్‌ను కాపాడుతుందని ఆరోపించారు. మిషన్‌ భగీరథలో జరిగిన అవకతవకలపై త్వరలో నివేదిక వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన స్వగ్రామం, ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురానికి ఆదివారం విచ్చేసిన భట్టి విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరామని తెలిపారు. సోనియాపై పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకుందాని రాజకీయ పార్టీలను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎ్‌సకు ఏటీఎంగా మారిందన్న ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్నాభిన్నమైన పాలన వ్యవస్థను గాడిలో పెట్టి జవాబుదారీతనం తీసుకువస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు నెల మొదటి వారంలోనే వేతనాలు ఇచ్చేలా ఆర్థిక స్థితిని మెరుగుపరిచామని అన్నారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందా్‌సనాయక్‌, కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 04:59 AM