Share News

Kumaram Bheem Asifabad- మహానీయుల పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:11 PM

మహానీయుల పోరాటం స్ఫూర్తిని భావితరాలకు అందిద్దామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వెనకబడిన తరగుతల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌ దాసరి వేణు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీష్‌బాబు, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Kumaram Bheem Asifabad- మహానీయుల పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం
ఆసిఫాబాద్‌లో ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులరిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 10: మహానీయుల పోరాటం స్ఫూర్తిని భావితరాలకు అందిద్దామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వెనకబడిన తరగుతల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌ దాసరి వేణు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీష్‌బాబు, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన దైర్యశాలి, వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ తొలి దశ పోరాటంలో ఎందరో మహనీయుల కృషి ఉందని చెప్పారు. వారి పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడి తరగతుల అభివృద్ధి శాఖాధికారి సజీవన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, రజక సంఘం అధ్యక్షుడు మల్లయ్య జ్యోతిబాఫూలే సంఘం అధ్యక్షుడు శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తహసీల్దార్‌ రాంమోహన్‌ రావు ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రజకార్లను ఎదురించి విరోచిత పోరాటం చేసిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని కొనియాడా రు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడతల మల్లయ్య, తక్కపల్లి మాజీ ఎంపీటీసీ సంఘం శ్రీనివాస్‌, రజక మండల నాయకులు శంకర్‌, డిప్యూటీ తహసిల్దార్‌ ప్రేం కిరణ్‌, రోళ్లపాడు మాజీ ఉప సర్పంచ్‌ వెంకటేష్‌, నాయకులు శ్రీధర్‌, జుముడి ఆనంద్‌, వార్డుమెంబర్‌ గోగర్ల రాజేష్‌, ఏర్గటి రామన్న, లవద్య, ప్రేంకుమార్‌, పోతురెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు.

బెజ్జూరు: మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు నరేందర్‌, రాకేష్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని చాకలి వాడలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు హనుమంతు, శంకర్‌, రాజయ్య, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:11 PM