Share News

రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఊరుకోం

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:42 AM

రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ తోరణం, చార్మినార్‌లు రాజకీయ వ్యవస్థకు చిహ్నాలని, వాటిని తీసేస్తామనడం సరికాదని బీఆర్‌ఎ్‌సనేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ఆ గుర్తులను తొలగిస్తే ఊరుకోబోమని ఆయన

రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఊరుకోం

చరిత్రను మరిపించేందుకు సీఎం కుట్ర: వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ తోరణం, చార్మినార్‌లు రాజకీయ వ్యవస్థకు చిహ్నాలని, వాటిని తీసేస్తామనడం సరికాదని బీఆర్‌ఎ్‌సనేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ఆ గుర్తులను తొలగిస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క దీనిపై స్పందించాలని, సీఎం నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రులందరూ వ్యతిరేకించాలన్నారు. తెలంగాణ ఘన చరిత్రను కనుమరుగు చేసి చారిత్రక సందర్భాలను మరిపించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాకతీయులు అగ్రవర్ణాల వారు కాదని, నిరుపేదల కోసం పాలన సాగించారని.. చార్మినార్‌ హైదరాబాద్‌కు గుర్తు మాత్రమేకాకుండా అదొక గేట్‌వే అన్నారు. సీఎం ఆలోచన వెనుక ఆంధ్రామేధావుల ప్రభావం ఉందని, ఎవరో చెప్పిన వాటిని న మ్మి ఇలా ప్రవర్తించడమేమిటని ప్రశ్నించారు.

Updated Date - Feb 12 , 2024 | 02:42 AM