Share News

అభివృద్ధి కోసం హద్దులు చూసుకోం

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:28 PM

పాలమూరు జిల్లా అభివృద్ధి విషయంలో గత పాలకుల మాదిరిగా హద్దు లు, సరిహద్దులు చూసుకోమని ఉమ్మడి పాల మూరు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యేలమంతా సమిష్టిగా పనిచేస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జి మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు.

 అభివృద్ధి కోసం హద్దులు చూసుకోం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి మధుసూదన్‌రెడ్డి

- ఉమ్మడి పాలమూరు అంతా అభివృద్ధి

చెందడమే లక్ష్యం

- ప్రాజెక్ట్‌లు, విద్య,వైద్యం లక్ష్యంగా

సీఎం రేవంత్‌తో చర్చిస్తాం

- ఎమ్మెల్యేలు యెన్నం, జీఎంఆర్‌

మహబూబ్‌నగర్‌,జూలై 8: పాలమూరు జిల్లా అభివృద్ధి విషయంలో గత పాలకుల మాదిరిగా హద్దు లు, సరిహద్దులు చూసుకోమని ఉమ్మడి పాల మూరు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యేలమంతా సమిష్టిగా పనిచేస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జి మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లు, విద్యా వైద్య రంగాలను గత పాలకులు విధ్వంసం చేశా రని, ఇప్పుడు వాటి అభివృద్ధే లక్ష్యంగా వాటికి నిధుల సర్దుబాటుపై జిల్లాకు రానున్న సీఎం రేవంత్‌రెడ్డికి వి న్నవిస్తామని తెలిపారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మ హబూబ్‌నగర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ప్రదానంగా చర్చ జరుగుతుందని, ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలం కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని, దీనిపై సీఎంకు ప్ర జెంటేషన్‌ ఇస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న మహబూ బ్‌నగర్‌ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రితో ఉమ్మడి పాల మూరు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందనుందని ఈ ఆసుపత్రి నిర్మాణం త్వరిగతిన చేపట్టి అందుబా టులోకి తీసుకోవస్తే జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూ రుతుందన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ ట్రై జంక్షన్‌ వద్ద ప్రభుత్వ భూములున్నా యని అక్కడ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజి ఏర్పాటు చేస్తే మూడు రాష్ట్రాలకు లబ్ది చేకూరనుందని తెలిపారు. పాలమూరు యూనివర్సిటికి రూ.100 కోట్ల నిధులు రావడంతో విద్యాపరంగా ఉమ్మడి జిల్లాకు మంచి రోజులు రానున్నాయని, యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్‌ కళాశాలల ఏర్పాటుకు అడుగులు పడు తున్నాయన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో అందరిని కలుపుకుని ముందుకుపోతామని, అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఎంపీగా గెలిచిన డీకే అరుణ కూడా పాలమూరు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని, మహబూబ్‌నగర్‌కు కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌ ముందుగా అరగంట పాటు ఉమ్మడి జిల్లా ఎ మ్మెల్యేలతో మాట్లాడిన తరువాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని, అనంతరం ఏఎస్‌ఎన్‌ గార్డెన్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఉంటుందన్నారు. సమావేశం లో నాయకులు ఒబేదుల్లా కొత్వాల్‌, వినోద్‌కుమార్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్‌, రాములు యాదవ్‌, ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:28 PM