Share News

ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతాం..

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:24 AM

రాష్ట్రంలో పద కొండు నెల ల కాలంలో రేవంత్‌ రెడ్డి సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతి రేక పా లనను ఎండగడుతామని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతాం..

ఫ బోనస్‌ కాదు..మద్దతు ధర అందే పరిస్థితి లేదు

ఫ మాజీ మంత్రి గంగుల కమలాకర్‌

జగిత్యాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పద కొండు నెల ల కాలంలో రేవంత్‌ రెడ్డి సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతి రేక పా లనను ఎండగడుతామని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం జిల్లాలోని కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి జగిత్యాల పట్టణం వరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాం డు వద్ద నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడారు. కేసీఆర్‌ సర్కారులో మంత్రులు భయంతో పనిచేశారని..ప్రస్తుతం రేవంత్‌ పాలనలో మం త్రులు భరి తెగించి పనిచేస్తున్నారని విమర్శించారు. కేంద్రాల్లో రైతు లు ఎదుర్కొంటున్న కష్టాలను చూడడానికి మంత్రులు ధాన్యం కేంద్రా లను సందర్శించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ రమణ, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడారు. ఈ కా ర్యక్రమంలో కవి దేశపతి శ్రీనివాస్‌, మాజీ మంత్రి రాజేశం గౌడ్‌, వేము లవాడ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి చెల్మడ లక్ష్మీ నర్సింహారావు, నాయకులు కొం డూరి రవీందర్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, కేడీ సీసీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ తుల ఉమ, పుట్ట మధు పాల్గొన్నారు.

రైతు సమస్యల పరిష్కారానికే పాదయాత్ర

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌

రైతు సమస్యల పరిష్కారానికే పాద యాత్ర నిర్వహిస్తున్నట్లు కోరు ట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. మంగళవారం జగి త్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్ట డానికి పాదయాత్ర చేశానన్నారు. రోడ్‌ షోలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ పాడిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

జగిత్యాలరూరల్‌: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సం జయ్‌ చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా మాజీమంత్రి హరీష్‌రావు జ గిత్యాల రూరల్‌ మండలం చల్గల్‌ నుంచిజగిత్యాల వరకు పాద యా త్రలో పాల్గొన్నారు.

రైతు సమస్యలపై ప్రశ్నిస్తే భౌభౌ అంటున్నాడు...

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి

కోరుట్ల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : మూసీ నదిలో ఎంత కంపు ఉందో అంతకు రెట్టింపు కంపు సీఎం రేవంత్‌ నోటిలో ఉందని, రైతుల సమస్యలపై నిలదీస్తే భౌభౌ అంటున్నాడని బాల్కొండ ఎమ్మెల్యే మా జీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వ పని తీరుపై విరుచుకపడ్డారు. మం గళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ను దూరం చేసుకు న్నామని ఇప్పడు రైతులు బాధపడుతు న్నారనిన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారంపై ఎంత పెద్ద ఉద్యమమైన చేపడుతా మ న్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నా యకుల తలలు వంచి రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఫ ఎమ్మెల్యే సంజయ్‌ నిర్వహిస్తున్న పాదయాత్రను మంగళవారం రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉ మ డాక్టర్‌ సంజయ్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలోని అంబే ద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు తిరగి పా దయాత్రను కొనసాగించారు.

Updated Date - Nov 13 , 2024 | 12:24 AM