Share News

పోటీపడి జిల్లాను అభివృద్ధి చేసుకుందాం

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:07 PM

సమైక్యపాలనలో మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృ ద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ పదేళ్లపాలనలో వందేళ్ల విధ్వం సం జరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పోటీపడి జిల్లాను అభివృద్ధి చేసుకుందాం

- ఎంపీగా గెలుపొందిన డీకే అరుణకు శుభాకాంక్షలు : ఎమ్మెల్యే యెన్నం

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేద్దామని సూచన

మహబూబ్‌నగర్‌, జూన్‌ 5 : సమైక్యపాలనలో మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృ ద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ పదేళ్లపాలనలో వందేళ్ల విధ్వం సం జరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అభివృద్ధిలో మహబూ బ్‌నగర్‌ వెనక్కి నెట్టివేయబడిందని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జిల్లా బిడ్డ రేవంత్‌రెడ్డి ఉన్నారని గుర్తు చేస్తూ ఎంపీగా డీకే అరుణ అధిక నిధులు తీసుకు వచ్చే విషయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అప్పుడే వెనకబడిన మహబూబ్‌నగర్‌ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డా రు. మూడు నెలలుగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం కోసం ఎంతో శ్రమించారని, చివరకు బీజేపీని విజయం వరించిందని, ఎంపీగా గెలిచిన డీకే అరుణకు శుభాకాంక్షలు చెబుతున్నామని అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌గౌడ్‌, నాయకులు సంజీవ్‌ ముదిరాజ్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, సిరాజ్‌ఖాద్రి, సీజే బెనహర్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఓట్లేమయ్యాయో ? : చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం తనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఎంతో కష్టపడి పనిచేశామని, అందరూ ఊహించిన ట్లుగా ఇక్కడ బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా మా పార్టీపై నమ్మ కం, కార్యకర్తల కష్టం వల్ల గణనీయమైన ఓట్లు సాధించామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ ఓట్లేమ య్యాయని, ఈ ఓట్లు ఎక్కడికెళ్లాయనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఆ పార్టీ భవిష్యత్తులో ఉంటుందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అతితక్కువ ఓట్లు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో వచ్చాయని, వీరి ఓట్లు ఎవరికి పడ్డాయో అందరికీ అర్థమైందన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 11:07 PM