Share News

బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తిక్క సన్నాసులు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:33 PM

పచ్చి అబద్ధాలతో ప్రజలకు నిజమని నమ్మించే ప్రయత్నం బీఆర్‌ఎస్‌, బీజేపీ తిక్క సన్నాసులు చేస్తున్నారని మహబూ బ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తిక్క సన్నాసులు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఓ పిచ్చోడు బస్సులో బయలుదేరాడు

- హామీల అమలుకు ప్రణాళిక జరుగుతోంది

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 24 : పచ్చి అబద్ధాలతో ప్రజలకు నిజమని నమ్మించే ప్రయత్నం బీఆర్‌ఎస్‌, బీజేపీ తిక్క సన్నాసులు చేస్తున్నారని మహబూ బ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హామీలు అమలు కాలేదని పిచ్చి వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో కూడిన రెం డు, మూడు హామీలు డబ్బు సమకూర్పు కోసం ఆలస్యం అవుతుందని, ఈ విష యం అర్థం కాని తిక్క సన్నా సులు ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్య క్షుడు, దేవరకద్ర ఎమ్మె ల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడా రు. హామీల అమలుకు పక్కా ప్రణాళికతో వెళుతున్నామని, అన్ని హామీల అమ లుకు గ్రౌండింగ్‌ చేశామన్నారు. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అవుతుందని, మోదీ, కేసీఆర్‌ పదే ళ్లు అధికారంలో ఉండి హామీలు అమలు చేయలేదని, అం దుకే ప్రజలు కేసీఆర్‌ను బండకేసి కొట్టారని, మోదీని కూడా కొట్టబోతున్నార న్నారు. ఓ పిచ్చోడు బస్సు యాత్రతో బయలుదేరాడని, ఇన్నాళ్లు కాళేశ్వరం ఎక్క డ మునిగిపోతే జనం ఎక్కడ ఇళ్లమీద పడి తంతారోనని మూసుకుని ఇంట్లో కూర్చున్నారని, కూతురు జైలుకుపోయింది, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున ఎన్నికలు వచ్చాయి కాబట్టి బయటకు వచ్చి తిక్క వాగుడు వాగుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అబద్ధాలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. బీఆర్‌ఎస్‌ సెమీ ఫైనల్‌లో ఓడిపోయిందని, వాళ్లు సీన్‌లో లేరని కేవలం పేకాటలో జోకర్‌లని ఎద్దేవా చేశారు. రేవంత్‌ సీఎం అయ్యాక నాలుగు నెలల్లో ఉమ్మడి పాలమూరు కు రూ.10 వేల కోట్లు మంజూరయ్యాయని, పాలమూరు ప్రజల మీద ఇంతకన్నా ప్రేమ ఎవరికైనా ఉంటుందని అని ప్రశ్నించారు. దీన్ని బట్టి ఎవరికి ఓటేయాలో అన్న విజ్ఞత పాలమూరు ప్రజలకు ఉందన్నారు. పాలమూరు- రంగారెడ్డిని రెండేళ్లలో పూర్తిచేసే అవకాశం ఉండేదని, ఇటు బీఆర్‌ఎస్‌ కానీ, అటు బీజేపీకానీ పట్టించుకోలేదన్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్‌కు రూ.27 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి రేవంత్‌తోనా?, డీకే అరుణతో సాధ్యమవుతుందా ఓటర్లు ఆలోచించాలని కోరారు. సమావేశంలో ఓబీసీ కార్పొ రేషన్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌గౌడ్‌, నాయకులు ఏపీ.మిథున్‌ రెడ్డి, వినోద్‌కుమార్‌, జహీర్‌అక్తర్‌, బురుజు సుధాకర్‌ రెడ్డి, బెనహర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, ఫయాజ్‌, అజ్మత్‌అలీ తదితరులున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:33 PM