భూ సేకరణ సర్వేను వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:01 AM
ఎన్‌ఎచ్ 63 ని ర్మాణం కోసం చేస్తున్న భూ సేకరణ పనులను అధికా రులు సమన్వయంతో వీలైనంత త్వరగా పూర్తి చేయా లని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు.

బుగ్గారం మండలంలో పరిశీలీస్తున్న కలెక్టర్ బి, సత్య ప్రసాద్
ఫకలెక్టర్ బి, సత్య ప్రసాద్
బుగ్గారం అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఎచ్ 63 ని ర్మాణం కోసం చేస్తున్న భూ సేకరణ పనులను అధికా రులు సమన్వయంతో వీలైనంత త్వరగా పూర్తి చేయా లని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. గురువారం బుగ్గారం మండలంలో జాతీయ రహదారుల అథారిటీ అధికారులు చేస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పనుల ను సకాలంలో పూర్తి చేయాలని, రోడ్డు నిర్మాణంలో రై తులు, ప్రజలు ఇబ్బంది పడకుండా చేపట్టాలని తెలి పా రు. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోతున్న భూమి, ఇండ్లు, కట్టడాలు, చెట్లు, బోర్లు, పైపులైన్లు, ఇతర నిర్మాణాలను పరిశీలించి, వాటికి చెల్లిం చాల్సిన నష్ట పరిహారం అంచనా విలువల నివేదికలు త యారు చేసేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వ యంతో కలిసి చేయాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన సర్వేలో భూములు కోల్పోతున్న వారు తెలిపిన అభ్యంత రాలను పరిగణంలోకి తీసుకొని భూ సేకరణలో ఎదుర వుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడం, అనుసరించాల్సిన విధానాలను వివరించారు. ఈ కార్యాక్రమంలో ఆర్టీవో శ్రీనివాస్, సర్వే, రెవెన్యూ, ఫారెస్ట్ హార్టి కల్చర్, సంబం ధిత అధికారులు,తహాసీల్దార్ మజీద్, డిప్యూటీ తహసీ ల్దార్ శ్రీకాంత్, ఆర్‌ఐ బాపురెడ్డి పాల్గొన్నారు.