Share News

రోడ్డు ప్రమాదంలో కూలీ దుర్మరణం

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:20 AM

పత్తి కూలీకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళా కూలీలను ట్యాంకరు ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీ వ్ర గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదం నకిరేకల్‌ శివారులోని చందంపల్లి స్టేజీ వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది.

 రోడ్డు ప్రమాదంలో కూలీ దుర్మరణం
నీలమ్మ ( ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో కూలీ దుర్మరణం

నకిరేకల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పత్తి కూలీకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళా కూలీలను ట్యాంకరు ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీ వ్ర గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదం నకిరేకల్‌ శివారులోని చందంపల్లి స్టేజీ వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. నకిరేకల్‌ ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నకిరేకల్‌లోని పన్నాలగూడెంకు చెందిన లింగంపల్లి నీలమ్మ (42), ఎదుల్ల జ్యోతి, జి.భాగ్యమ్మ పత్తి వేరేందుకు నకిరేకల్‌ శివారులోని చందంపల్లి సమీపంలోని పత్తి చేనుకు వెళ్లారు. పత్తి ఏరిన తర్వాత సాయంత్రం తిరుగు పయమయ్యారు. నకిరేకల్‌కు నడుచుకుంటూ వస్తున్నారు. డివైడర్‌ దాటుతున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న గుర్తు తెలియ ని ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నీలమ్మ దుర్మరణం చెందగా ఏదుళ్ల జ్యోతి, భాగ్యమ్మకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వవారిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన నీలమ్మ భర్త సోమయ్య కొంత కాలంగా పన్నాలగూడెంలోని గాలి మిషన నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 06:50 AM