ఘనంగా కుడారే హారతి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:18 PM
ఎదులాబాద్‌లోని శ్రీగోదా సమేత శ్రీమన్నార్ రంగనాయకస్వామి దేవాలయంలో శుక్రవారం గోదాదేవికి ఘనంగా కుడారే(గంగానం) హారతి నిర్వహించారు.

ఘట్‌కేసర్ రూరల్, జనవరి 12 : ఎదులాబాద్‌లోని శ్రీగోదా సమేత శ్రీమన్నార్ రంగనాయకస్వామి దేవాలయంలో శుక్రవారం గోదాదేవికి ఘనంగా కుడారే(గంగానం) హారతి నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి 150 కుడారే పాత్రల్లో అమ్మవారికి ప్రత్యేకంగా చేసిన నైవేద్యం, ప్రసాదాలను ఆమ్మవారికి సమర్పించి. అనంతరం కుడారేలను భక్తులకు పంపిణీ చేశారు. ఉదయం గోదాదేవికి ప్రత్యేకపూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త టీపీ లక్ష్మణాచార్యుల దంపతులకు ముఖద్వార నిర్మాణధాత బట్టె లక్ష్మన్ దంపతులు వస్త్రాలు సమర్పించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు టీపీ గోవిందాచార్యులు, శేషాచార్యులు, అచ్యుతాచార్యులు, అధిత్యాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.