రూ.1500 కోట్లకు కుచ్చుటోపీ!
ABN , Publish Date - Oct 27 , 2024 | 03:18 AM
హైదరాబాదుకు చెందిన ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ పంతాంగి కమలాకర్‌శర్మ రూ.1500 కోట్లు కుచ్చుటోపీ పెట్టారని, తమకు న్యాయం చేయాలని ధన్వంతరీ ఫౌండేషన్ బాధితుల ఫోరం సభ్యులు కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ, సభ్యులు శేషగిరిరావు, రంగారావు, రాజ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడారు.
ధన్వంతరీ ఫౌండేషన్ బాధితుల ఫోరం
మంత్రాలయం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): హైదరాబాదుకు చెందిన ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ పంతాంగి కమలాకర్‌శర్మ రూ.1500 కోట్లు కుచ్చుటోపీ పెట్టారని, తమకు న్యాయం చేయాలని ధన్వంతరీ ఫౌండేషన్ బాధితుల ఫోరం సభ్యులు కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ, సభ్యులు శేషగిరిరావు, రంగారావు, రాజ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడారు. 2004లో బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ది కోసం హైదరాబాదుకు చెందిన ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థను మరికొందరితో కలిసి కమలాకర్‌శర్మ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందులో దాదాపు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుకు చెందిన 400 మంది బ్రాహ్మణులను సభ్యులుగా చేర్చి 15 నుంచి 20 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి రూ.లక్ష నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన రెండేళ్ల వరకు కొంతమందికి చెప్పిన ప్రకారం వడ్డీ ఇచ్చారన్నారు. అయితే 2023 నుంచి కమలాకర్ శర్మ తప్పించుకు తిరుగుతూ దాదాపు రూ.1,500 కోట్లు మోసం చేశారన్నారు. 2024లో ధన్వంతరి ఫౌండేషన్ బాధితుల పోరం ఏర్పాటు చేసుకుని కమలాకర్‌శర్మ కోసం వెతుకుతున్నామని చెప్పారు.