Share News

కేటీఆర్‌లో అహంకారం తగ్గలేదు

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:30 AM

: ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా కేటీఆర్‌లో అహంకారం తగ్గలేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ చిన్నాభిన్నమైనా సిగ్గు రావట్లేదన్నారు. చెల్లెలు కవిత జైలుకు పోయి

కేటీఆర్‌లో అహంకారం తగ్గలేదు

నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తాం

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా కేటీఆర్‌లో అహంకారం తగ్గలేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ చిన్నాభిన్నమైనా సిగ్గు రావట్లేదన్నారు. చెల్లెలు కవిత జైలుకు పోయి కేసులు చుట్టుముడుతుంటే బుర్ర పనిచేయక నిరాశా నిస్పృహతో సీఎం రేవంత్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్‌ నోటి దురుసును తగ్గించుకోకుంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ‘‘సీఎంను పట్టుకుని హౌలా అంటావా? నువ్వే పెద్ద హౌలా.. బట్టేబాజ్‌ గానివి. ఎన్నికల్లో ప్రజలు నిన్ను, నీ అయ్యను ఇంటికి పంపించారు. ప్రజల జేబులు కొట్టి కల్వకుంట్ల కుటుంబం దాచుకున్న వేల కోట్లను కక్కిస్తాం’’ అని ధ్వజమెత్తారు. దొంగలు కాబట్టే కేటీఆర్‌ చెల్లెలు కవిత తిహాడ్‌ జైల్లో ఉందని, కేటీఆర్‌ కూడా చంచల్‌గూడ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 04:30 AM