Share News

కేటీఆర్‌.. కోర్టుకు రావాల్సిందే

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:01 AM

సిల్వర్‌ స్పూన్‌తో పుట్టిన కేటీఆర్‌కు అంత అహంకారం పనికిరాదని కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసినందుకు మదురై కోర్టులో

కేటీఆర్‌.. కోర్టుకు రావాల్సిందే

ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు

నా గౌరవం కోసం చివరి దాకా పోరాడతా

కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్‌

కేటీఆర్‌కు పరువు నష్టం నోటీసులు పంపినట్లు వెల్లడి

ఏపీలో వైసీపీకి మిగిలేది ముగ్గురు ఎంపీలేనని జోస్యం

న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): సిల్వర్‌ స్పూన్‌తో పుట్టిన కేటీఆర్‌కు అంత అహంకారం పనికిరాదని కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసినందుకు మదురై కోర్టులో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఆయన బదులిచ్చారు. ‘‘క్లోజ్డ్‌ కేసును దారి మళ్లించడానికి ప్రయత్నించవద్దు. మీరు నాపై మాత్రమే ఆరోపణలు చేశారు. వీడియోలో ఇతర పేర్లు లేవు. మదురై కోర్టు విచారణను ఎదుర్కోకుండా పారిపోలేవు. మీకు ఇంత అహంకారం పనికిరాదు. మీ పెయిడ్‌ సోషల్‌ మీడియా టీమ్‌ ‘ఎక్స్‌’లో మాత్రమే దాడి చేయగలదు. ఒక అమాయకుడిని నిందించినందుకు కోర్టుకు రావాల్సిందే. నిజాయతీపరులకు ఇంకెప్పుడూ ఇలా జరగకూడదు’ అని ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌కు పరువు నష్టం నోటీసులు పంపానని, 7 రోజుల్లోగా స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాగా, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.

Updated Date - Feb 01 , 2024 | 10:07 AM