Share News

పైరవీలకు అడ్డాగా సచివాలయం: కేపీ వివేకానంద

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:45 AM

కాంగ్రెస్‌ పాలన వచ్చాక సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం పైరవీలకు అడ్డాగా మారాయని, తమ ప్రభుత్వంలో పైరవీలకు తావు ఉండేది కాదని

పైరవీలకు అడ్డాగా సచివాలయం: కేపీ వివేకానంద

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పాలన వచ్చాక సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం పైరవీలకు అడ్డాగా మారాయని, తమ ప్రభుత్వంలో పైరవీలకు తావు ఉండేది కాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తమ ఎమ్మెల్యేలను నియంత్రించలేకపోతున్నారని, ఆయన నాయకత్వాన్ని పార్టీ సీనియర్లు పలువురు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ అత్యధిక ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్‌ భయపడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, గడ్డం రంజిత్‌రెడ్డిపై ఆ పార్టీ క్యాడర్‌ తిరుగుబాటు చేస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత చోటుచేసుకునే రాజకీయ మార్పుల దృష్ట్యా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు రేవంత్‌ తాపత్రయపడుతున్నారని, కొద్ది రోజుల్లోనే బండారం బయటపడుతుందని జోస్యం చెప్పారు.

Updated Date - Apr 22 , 2024 | 04:45 AM