Share News

Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ABN , Publish Date - Dec 17 , 2024 | 06:16 AM

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే సీతారామచంద్రస్వామి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.

Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం  కలగొద్దు

  • అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం

హైదరాబాద్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి) : వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే సీతారామచంద్రస్వామి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఈనెల 31 నుంచి వచ్చేనెల 20వ తేదీ వరకు నిర్వహించే ఈ అధ్యయనోత్సవాలకు హాజరుకావాల్సిందిగా మంత్రిని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆమెకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై అధికారుల్ని మంత్రి ఆరా తీశారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌, కమిషనర్‌ శ్రీధర్‌, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 06:16 AM