‘కొండపాలైన కొమురవెల్లి సొమ్ము’పై దేవాదాయశాఖ కమిషనర్ ఆరా
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:35 AM
మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ తన సొంత నిధులతో కొమురవెల్లి మల్లికార్జునస్వామి కొండపై నిర్మించ తలపెట్టిన గెస్ట్‌హౌజ్ నిర్మాణం

విచారణ చేసి నివేదిక అందించాలని ఏడీసీకి ఆదేశం
చేర్యాల, ఏప్రిల్ 2: మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ తన సొంత నిధులతో కొమురవెల్లి మల్లికార్జునస్వామి కొండపై నిర్మించ తలపెట్టిన గెస్ట్‌హౌజ్ నిర్మాణం కోసం దాసారం గుట్ట అప్రోచ్‌రోడ్ పనుల్లో ఆలయ నిధులు ఖర్చు పెట్టడంపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆరా తీశారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం ఆలయ నిధులు రూ.4.38 కోట్లు ఖర్చుపెట్టడంతో పాటు అదనంగా రూ.1.90 కోట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్లు మంగళవారం ఆంధ్రజ్యోతిలో ‘కొండపాలైన కొమురవెల్లి సొమ్ము’ కథనం ప్రచురితమైంది. ఈ విషయమై దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు స్పందించి నిధుల మంజూరు, పనుల నిర్వహణ ఇతరత్రా అంశాలపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక అందించాలని దేవాదాయశాఖ ఏడీసీని ఆదేశించారు.